వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అలా వద్దు: మంత్రి కెటిఆర్ వివరణపై పెదవి విరిచిన ఈసీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు పైన ఎన్నికల సంఘం (ఈసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయనకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది.

ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించింది. అధికారిక హోదాను పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించటం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఫిర్యాదులకు అవకాశమివ్వద్దని చెప్పింది.

కాగా, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఇతర పార్టీల నేతలని టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

EC unhappy with Minister KTR clarification

దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. మరమ్మతుల అంశంపై ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తనను కలిశారన్న మంత్రి కేటీఆర్ వివరణతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

క్రమబద్ధీకరణ పైన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ జోలికి వెళ్లవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగించవచ్చునని తెలిపింది.

English summary
Election Commission unhappy with Minister KTR clarification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X