హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం; 15చోట్ల సోదాలు, వారిలో టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేకమార్లు తెలంగాణ రాష్ట్రంలో ఈడి అధికారులు సోదాలను నిర్వహించగా, మళ్లీ తాజాగా నిర్వహిస్తున్న సోదాలతో అటు వ్యాపారవర్గాలు, ఇటు రాజకీయ నాయకులలోనూ టెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈడీ అధికారులు ఒకసారిగా ఈరోజు తెల్లవారుజాము నుంచి దాడులు చేస్తున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఈడీ దాడుల ప్రకంపనలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా పల్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు ఇళ్ళు, కార్యాలయాలలో దాడులు చేపట్టిన ఈడి అధికారులు, ఫార్మా కంపెనీ ఎండి శ్రీధర్ రావు ఇళ్లతో పాటు హైదరబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలలో సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మాదాపూర్, బంజారాహిల్స్ , పటాన్ చెరుతోపాటు పలుచోట్ల ఈడి అధికారులు దాడులు చేస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడి అధికారులు 15 ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఇక ఈ దాడులలో అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఫీనిక్స్ టెక్ జోన్ కంపెనీ లోను ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల లోను దాడులు కొనసాగిస్తున్న అధికారులు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలలో ఉన్న కార్యాలయాలలో తనిఖీలు జరుపుతున్నారు. ఫీనిక్స్ టెక్ జోన్ డైరెక్టర్ గోపాలకృష్ణ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. గోపాలకృష్ణ ఫినిక్స్ తో పాటు 15 సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నట్టు , మరో 19 కంపెనీలకు ఆయన అసోసియేట్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.
గతంలోనూ ఈ సంస్థ పై ఐటి అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఇది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక మరోవైపు సాహితీ ఇన్ఫ్రా కు సంబంధించిన సంస్థలపై కూడా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఫ్రీ లాంచ్ పేరుతో స్థిరాస్తి మోసాలకు పాల్పడినట్టు ఈ సంస్థపై అభియోగాలు ఉండడంతో ఈరోజు ఉదయం నుంచి కంపెనీకి సంబంధించి 8 ప్రాంతాలలో ఈడి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications