Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‍లో ఈడీ సోదాలు..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయం నుంచి ఈడీ అధికారులు జూబ్లీహిల్స్‌లోని యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌లతో సహా మైత్రి మూవీ మేకర్స్, దాని ప్రమోటర్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ సోదాలు చేస్తోంది.

ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన ఎన్‌ఆర్‌ఐలుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. GST నిబంధనలను ఉల్లంఘించినందుకు, వారి ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITRs) తప్పుడు వివరాలను అందించారని ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ నివాసాలు, కార్యాలయ ప్రాంగణాల్లో గత ఏడాది డిసెంబర్‌లో వస్తు సేవల శాఖ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

ED searches in the Mythri Movie Makers office

2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు తీస్తోన్నట్లు తెలిసింది.

అటు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుకుమార్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిగా కొనసాగుతున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు సుకుమార్. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నారు. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+