కేజ్రీవాల్ ముడుపుల అంశంపై ఆధారాలతో కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈడీ.. బిగుస్తున్న ఉచ్చు!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ కేసులో కీలకంగా తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్న ఈడీ అధికారులు, ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన అరవింద్ కేజ్రీవాల్ ను సైతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ టార్గెట్ గా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో ఆధారాలను ముందుంచి కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
దీంతో ఈ కేసులో కేజ్రీవాల్, కవిత ఈడి ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం అన్న చర్చ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ప్రధాన కుట్రదారుగా నిరూపించడానికి కావలసిన అన్ని ఆధారాల సేకరణను ముమ్మరం చేసిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను 8వ రోజు విచారణలో భాగంగా ఊపిరాడని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.

ఢిల్లీ మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులను స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ముడుపుల చెల్లింపు వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు ఏ విధంగా చెల్లించారు అన్న అంశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం.
వివిధ మార్గాల ద్వారా కవిత పోషించిన పాత్రపై ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ఆమె ముందు పెట్టి విచారించినట్లు సమాచారం. కవితతో పాటు, ఈ లిక్కర్ కుంభకోణంలో మేక శరణ్ పాత్రపై కూడా ఈడి అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేసిన సమయంలో ఉన్న మేక శరణ్ ఫోన్ లో గుర్తించిన సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారం పై కూడా కవితను ప్రశ్నించినట్టు సమాచారం.
శరణ్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను పదేపదే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కేసులో సమీర్ మహేంద్రు కీలక పాత్ర పోషించారని ఆయనను మరోమారు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. సమీర్ మహేం ద్రు ఒక్కడినే విచారిస్తారా? లేకా ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు తో కలిపి విచారిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications