మహేష్ కత్తిపై గుడ్ల దాడి: ఖబడ్డార్! పవన్ కళ్యాణ్, ఒక్క మాట చెప్పలేవా.. ఓయూ జేఏసీ

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. పవన్ ఫ్యాన్స్, మహేష్ కత్తి మధ్య గత కొద్ది నెలలుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొని వెళ్తుండగా కొండాపూర్ ప్రాంతంలో ఆయనపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు. పవన్ అభిమానులే ఈ దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆయన కారు దిగిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

చదవండి: పూనమ్‌ను లాగి తప్పులో కాలు: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని పిలుపు

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని పిలుపు

మహేష్ కత్తిపై కోడిగుడ్లతో దాడి జరిగిన ఘటనను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఖండించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు నిచ్చింది.

 అభిమానులకు ఒక్కమాట చెప్పని పరిస్థితిలో ఉన్నారా

అభిమానులకు ఒక్కమాట చెప్పని పరిస్థితిలో ఉన్నారా

ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకుడు రవి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

 పవన్ కళ్యాణ్ సినిమా ఆడనివ్వం

పవన్ కళ్యాణ్ సినిమా ఆడనివ్వం

తెలంగాణ ప్రాంతంలోని అన్ని యూనివర్శిటీలకు ఈ మేరకు సమాచారం అందిస్తామని, పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వమని వారు హెచ్చరించారు. కత్తి మహేశ్‌కు అండగా ఉంటామని చెప్పారు.

 ఖబడ్డార్ పవన్ కళ్యాణ్

ఖబడ్డార్ పవన్ కళ్యాణ్

ఖబడ్దార్ పవన్ కళ్యాణ్! తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా అంటూ ఆయన పవర్ స్టార్ పైన తీవ్రంగా మండిపడ్డారు.

 వీడియో పోస్ట్ చేసిన మహేష్ కత్తి

వీడియో పోస్ట్ చేసిన మహేష్ కత్తి

ఇదిలా ఉండగా పవన్ ఫ్యాన్స్ ఓ యువకుడిని చితకబాదిన వీడియోను మహేష్ కత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ యువకుడు అజ్ఞాతవాసి పోస్టర్‌ను చెప్పుతో కొట్టి, తిట్టరాని తిట్లు తిట్టాడు. పైగా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పవన్‌ను తిట్టడం, చెప్పుతో కొట్టడం పవన్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అభిమానులు సదరు యువకుడిని కొట్టి, క్షమాపణ చెప్పించారు.

 సారీ చెప్పించారు

సారీ చెప్పించారు

ఇందుకు సంబంధించిన వీడియోను మహేష్ కత్తి తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశారు. తాను తప్పు చేశానని అని పవన్ అభిమానులు అతనితో అనిపించినట్లుగా వీడియోలో ఉంది. కాగా, పవన్ సినిమా చూడమని చెప్పలేదని, పైగా ఇష్టం వచ్చినట్లు అతనిని తిట్టడం, చెప్పుతో కొట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+