పూనమ్‌ను లాగి తప్పులో కాలు: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్ మహేష్ మధ్యలో పూనమ్ కౌర్‌

  హైదరాబాద్: హైప్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పదేపదే టార్గెట్ చేస్తున్న మహేష్ కత్తి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయనకు పలువురు ఫోన్లు చేశారు. దాదాపు అందరూ కూడా మహేష్ కత్తి తీరునే తప్పుబట్టారు.

  చదవండి: రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

  ఒక్కొక్కరు ఒక్కో సూచన చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌ను మీరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని, మీరు ఆయనను వదలడం లేదని, అందుకే అభిమానులు మిమ్మల్ని అంటున్నారని ఫోన్లు చేసిన వారు విమర్శించారు. ఓ విధంగా సూటిగా మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫోన్లు చేసిన వారిలో పవన్ అభిమానులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ఇతరులు కూడా ఆయన తీరునే తప్పుబట్టారు. పూనమ్ కౌర్‌ను లాగి మహేష్ కత్తి మరింత దిగజారిపోయారని అభిప్రాయపడ్డారు.

  చదవండి: తీవ్ర ఉద్రిక్తత: పవన్ ఫ్యాన్స్ అరెస్ట్, మహేష్ కత్తి కారుపై దాడి యత్నం

  పూనమ్ కౌర్‌ను లాగడంపై ఆగ్రహం

  పూనమ్ కౌర్‌ను లాగడంపై ఆగ్రహం

  పవన్‌ను విమర్శిస్తుంటే నటి పూనమ్ కౌర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మహేష్ కత్తి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అతను ఓ యువతిపై వ్యక్తిగత విమర్శలకు దిగి హద్దులు దాటారని చాలామంది అభిప్రాయపడ్డారు. నటి అపూర్వ మాట్లాడుతూ.. పవన్ విషయంలో మహేష్ కత్తి తీరును తప్పుబట్టారు. అంతేకాదు. పూనమ్ కౌర్ చిన్నపిల్ల అని, ఓ యువతి పరువును తీస్తారా అని నిలదీశారు. ఆమెకు తెలిసో తెలియకో మిమ్మల్ని ప్రశ్నించారని, కానీ అన్నీ తెలుసని మీరే చెప్పుకుంటున్నారని, అలాంటి మీరు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

  అంతా చేసి, బాధపడుతున్నానంటూ

  అంతా చేసి, బాధపడుతున్నానంటూ

  పూనమ్ కౌర్ పైన మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. దీంతో మహేష్ కత్తి కూడా పలుమార్లు అది బాధాకరమేనని కానీ అంటూ మాట్లాడారు. సురేష్ అనే టెలీకాలర్ మాట్లాడుతూ.. పూనమ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, అలా మాట్లాడటం సరికాదన్నారు.

  జనాలను రెచ్చగొడుతున్నారు

  జనాలను రెచ్చగొడుతున్నారు

  మీరు జనాలను రెచ్చగొడుతున్నారని, ఇది పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్స్, మహేష్ కత్తిల గొడవ మాత్రమే కాదని ఓ కాలర్ అన్నారు. మీరు జనాలను రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. పవన్‌ను మీరే వ్యక్తిగతంగా పదేపదే టార్గెట్ చేయడం సరికాదని కాలర్లు అభిప్రాయపడ్డారు.

  యాంకర్ నిలదీత

  యాంకర్ నిలదీత

  ఓ సందర్భంలో ఇంటర్వ్యూ చేసిన వారు కూడా.. సమాజంలో ఆడపిల్ల (పూనమ్) గురించి జాగ్రత్తగా మాట్లాడాలని, మీరు అలా మర్యాదగా మాట్లాడినట్లు ఎవరికీ అనిపించలేదని, ఆమె క్యారెక్టర్ తప్పుపట్టేలా మీరు మాట్లాడారని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ పబ్లిక్‌కా చెప్పడం సరికాదని, అసలు ఈ సమస్యను (పవన్ కళ్యాణ్) పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యం మీకు లేదని ఇంటర్వ్యూ చేసిన వారు అన్నారు. మీకు చాలా ఇగో ఉన్నట్లుగా ఉందన్నారు.

  అసలు మీరు ఎవరికి తెలుసు

  అసలు మీరు ఎవరికి తెలుసు

  ఓ కాలర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం సరికాదని, రాజకీయంగా ఆయనకు ఓటు వేసే వాళ్లు వేస్తారని, లేదంటే లేదని, ఆయనను గెలిపించుకునే వారు గెలిపించుకుంటారని, లేదంటే ఓడించుకుంటారని చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదని, కానీ మీరు చేసేది తప్పని మహేష్ కత్తితో అన్నారు. బిగ్ బాస్‌లో చూసేవరకు మహేష్ కత్తి ఎవరో తనకు తెలియదని, ఆ తర్వాత పవన్‌ను టార్గెట్ చేశాక మరింత తెలిసిందని దిమ్మతిరిగే షాకిచ్చారు.

  మీరే కాంప్లికేట్ చేశారు

  మీరే కాంప్లికేట్ చేశారు

  పవన్‌తో విషయాన్ని మీరే కాంప్లికేట్ చేశారని, విషయాన్ని ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశ్యం నీకు లేదని, అందుకే ఇలా చేస్తున్నావని మహేష్ కత్తిని ఉద్దేశించి మరొకరు చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శలు సరికాదన్నారు. పూనమ్ కౌర్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. మీకు నిజంగానే సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యం ఉంటే కనీసం ఫోన్ నెంబర్ మార్చేవారని, కోట్లలో ఉన్న అభిమానుల వైఖరులు వేర్వేరుగా ఉంటాయని, వారు మాట్లాడే వాటికి మీరు స్పందించకుండా ఉంటే సరిపోతుందని, అసలు మీ వల్లే ఇలా జరుగుతోందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మీరు మొదట స్పందించడం వల్లే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఏదో అభిమానులు అన్నారంటూ మళ్లీ పవన్‌ను అనడం విడ్డూరంగా ఉందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mahesh Kathi drags actress Poonam Kaur into Jana Sena chief Pawan Kalyan issue on Sunday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి