తీవ్ర ఉద్రిక్తత: పవన్ ఫ్యాన్స్ అరెస్ట్, మహేష్ కత్తి కారుపై దాడి యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఆదివారం ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. నిత్యం జనసేనానిని టార్గెట్ చేస్తూ హైప్ తెచ్చుకుంటున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న కత్తి మహేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్

మహేష్ కత్తి ప్రెస్ మీట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి వచ్చారు. మహేష్ కత్తి పదేపదే పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు. దీంతో చాలామంది అభిమానులు మహేష్ కత్తిని నిలదీసేందుకు తరలి వచ్చారు.

 బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత

ఈ నేపథ్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రెస్ క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అభిమానులను కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాసేుప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 పవన్ కళ్యాణ్‌కు ఛాలెంజ్

పవన్ కళ్యాణ్‌కు ఛాలెంజ్

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద మాట్లాడిన కత్తి మహేష్ మీరో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. తన అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తనపై సామాజిక దాడి జరుగుతోందన్నారు. తనపై , తన కుటుంబంపై తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. అయితే, పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో అభిమానులు కొందరు ఆగ్రహంతో అలా మాట్లాడుతున్నారని పవన్ అభిమానులు చెబుతున్నారు. అసలు కత్తి మహేష్‌ పవన్‌ను విమర్శించడానికి గల కారణం అందరికీ తెలుసునని అంటున్నారు.

కత్తి మహేష్

కత్తి మహేష్

కత్తి మహేష్ ఇంకా మాట్లాడుతూ.. కోన వెంకట్ తన సామాజిక బహిష్కరణ అంటున్నారని అన్నారు. తనపై సామాజిక దాడిని ఆపాలని కోరుతున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భావాలను వ్యక్తపరిచే హక్కు తనకు ఉందని చెప్పారు.

భావాలను వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉందని, అందులో తప్పు లేదని, ఇతరులు చాలామంది పవన్‌ను అంటున్నారని, కానీ మహేష్ కత్తి పైనే అభిమానులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది గుర్తించాలనేది పవన్ ఫ్యాన్స్ వాదన. ఆయన పదేపదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, గతంలో అనుచిత పోస్టులు పెట్టడం కూడా జరిగిందని గుర్తు చేస్తున్నారు.

 నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు

నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు

తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని కత్తి మహేష్ ప్రెస్ మీట్‌లో చెప్పారు. అభిమానులను అదుపు చేసే బాధ్యత పవన్‌కు లేదా అని నిలదీశారు. ఓ సినిమా హీరో రాజకీయ నాయకుడు కావాలనుకున్నప్పుడు, ఓ సినీ విమర్శకుడు రాజకీయ విమర్శకుడు కాకూడదా అని ప్రశ్నించారు.

విమర్శలు చేయవద్దని ఎవరూ అనడం లేదని, ఎవరు ఏ రంగంలోనైనా ఉండవచ్చునని, కానీ విమర్శలు అర్థవంతంగా ఉండాలని, విమర్శలు చేసేటప్పుడు విలువలు పాటించాలని కోన వెంకట్, పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మహేష్ కత్తి విలువలు దాటి మాట్లాడుతున్నారని, అందుకే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం చేస్తున్నారని అంటున్నారు.

పవన్ ఫ్యాన్సును కంట్రోల్ చేయలేకపోతున్నారు

పవన్ ఫ్యాన్సును కంట్రోల్ చేయలేకపోతున్నారు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారని, తనను ఆయన అభిమానులు బెదిరిస్తున్నారని, టార్గెట్ చేస్తున్నారని కత్తి మహేష్ అన్నారు. అయితే, పవన్ తన అభిమానులకు సంయమనంగా ఉండాలని చెప్పే ప్రయత్నాలు చేసినా.. దానిని కూడా పోస్టు పెట్టి టార్గెట్ చేస్తున్నారని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు. పవన్ అదుపు చేయాలని చెబుతున్నారని, అదుపు చేసే ప్రయత్నం చేస్తే మళ్లీ రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. మహేష్ కత్తి హద్దు దాటి ప్రవర్తిస్తున్నందువల్లే ఇలా జరుగుతోందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

 కత్తి మహేష్ కారుపై దాడికి యత్నం

కత్తి మహేష్ కారుపై దాడికి యత్నం

ఇదిలా ఉండగా, మహేష్ కత్తి కారుపై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. ప్రెస్ క్లబ్ వద్ద అభిమానులు.. కత్తి మహేష్! నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు, మేము చాలు అంటూ నినాదాలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahesh Kathi press meet about his open challenges to Jana Sena chief Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి