అమరావతి పై మారిన జగన్ ప్లాన్, తాజా నిర్ణయంతో - కీలక మలుపు..!!
ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అవుతు న్న వేళ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పైన నిరసనలకు సిద్దమయ్యారు. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు కార్యక్రమాలు ఖరారు చేసారు. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా జగన్ కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
అమరావతి కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. అమరావతి లో పెడుతున్న ఖర్చు.. నిర్మాణాల తీరు పైన జగన్ వరుసగా విమర్శలు చేస్తున్నారు. మావిగన్ ప్రతిపాదనే సరైనదిగా వాదిస్తున్నారు. ఈ సమయంలోనే అమరావతి గ్రామాలకు చెందిన రైతులు జగన్ తో సమావేశమయ్యారు. తమ భూముల కు సంబంధించిన అంశాల పైన వారు వివరించారు. రెండో విడత భూ సమీకరణ .. గతం లో ఇచ్చిన హామీలు తమకు అమలు కావటం లేదని రైతులు చెప్పుకొచ్చారు. దీంతో.. సీఆర్డీఏ పరిధిలో రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ నేతలు.. న్యాయవాదులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా డీఎస్సీ అభ్యర్ధులు జగన్ తో భేటీ అయ్యారు. డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసనలకు దిగింది. ఈ అంశం పైనా పార్టీ.. న్యాయవాదులతో జగన్ ప్రత్యేకంగా కమిటీ నియమించారు.

సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నియామకంతో
అయితే, అమారావతిలో రాజధానికి రెండు లక్షల కోట్లు మౌలిక సదుపాయాలకే ఖర్చు అవుతుంది అని జగన్ చేస్తున్న వాదనతో ప్రభుత్వం విభేదిస్తోంది. అయితే, జగన్ మావిగన్ ప్రతిపాదన పైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ ప్రత్యేకంగా సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయటంతో.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. ఈ కమిటీ రాజధాని గ్రామాల్లోని రైతులతో వరుస సమావేశాలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల తో విభేదించే రైతులకు ఈ కమిటీ మద్దతుగా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే, అమరావతి కోర్ ఏరియాలో వైసీపీ తీరు పైన గతంలో పోరాటాలు జరిగాయి. ఇప్పుడు అమరావతిలో తిరిగి సానుకూలత పెంచుకునే క్రమంలో జగన్ వ్యూహాత్మకంగా ఈ కమిటీ ఏర్పాటు.. రైతులకు మద్దతు గా నిలవాలనే సంకేతాలు కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. దీంతో... తాజా పరిణామాల నేపథ్యం లో అమరావతి విషయంలో జగన్ వేస్తున్న అడుగులు ఎటు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications