ప్రధాని మోదీ మరో ఏడాది పాటే పదవిలో ఉంటారు..?

ప్రధాని మోదీపై లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీని టార్గెట్ చేస్తూ ఆయన పదవీకాలంపై జోస్యం చెప్పారు. ఒకప్పుడు మోదీ కోసమే పనిచేసిన వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, మోదీ నియంత్రణలోనే ఉన్న వ్యవస్థలు క్రమంగా కుప్పకూలుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. నీట్ 2026 పేపర్ లీకేజీతో పాటు ఇతర పరీక్ష పత్రాలు కూడా లీక్ కావడం, సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదం నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు.

న్యూఢిల్లీలో ఆదివాసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన గిరిజన నేతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. దేశ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని దీంతో వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయని కాంగ్రెస్ యువనేత చెప్పుకొచ్చారు. అంతేకాదు వ్యవస్థల్లో జరిగే అక్రమాలు అవినీతికి సంబంధించి అందులో పనిచేసే ఉద్యోగులు విపక్షపార్టీలకు సమాచారం చేరవేస్తున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నియంత్రణలో ఉండే వ్యవస్థల్లో తిరుగుబాటు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

rahul-gandhi-predicts-pm-modi-s-exit-in-one-year-targets-nda-over-exam-leaks-major-political-change

ఎమర్జెన్సీ విధించే అవకాశం

దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని చెప్పిన రాహుల్ గాంధీ..దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతోందన్నారు. ఎప్పుడైతే ప్రజాగ్రహం ఒక స్థాయిని దాటుతుందో ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని రాహుల్ అంచనా వేశారు.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ధరలపెంపు అని చెప్పిన రాహుల్...ఇదే దేశ ఆర్థిక వ్యవస్థను ముంచుతుందని అభిప్రాయపడ్డారు.

మాటలకు మరింత పదును

2024లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ పై ఈస్థాయిలో తీవ్రమైన విమర్శలు రాహుల్ గాంధీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విద్యారంగం, పరీక్ష పత్రాల లీకేజీ,సీబీఎస్ఈ వివాదంపై ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ అస్త్రాలుగా మలుచుకుని పదేపదే ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై మాటల దాడులు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఈ విమర్శలకు మరింత పదనుపెట్టారు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలైమందని, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టిందని ఆరోపించిన రాహుల్ గాంధీ... ఇంత వివాదాలు జరిగినప్పటికీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గు చేటని రాహుల్ విమర్శించారు.

పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం

కేంద్రం జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన నేపథ్యంలో రాజకీయ విమర్శలు ప్రతి ఒక్కరి నుంచి తీవ్రతరమయ్యాయి. నీట్ 2026 ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు వచ్చిన ఆరోపణలతో ఈ పరీక్ష రాసిన 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పడిపోయింది.దీంతో చేసేదేమీ లేక అధికారులు మరోసారి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది కేంద్రం. మరోవైపు సీబీఎస్‌ఈ పై వచ్చిన ఆరోపణలను కూడా కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. పేపర్ మూల్యాంకనలో జరిగిన తప్పులపై ఆరా తీస్తోంది.ఈ అంశం రాజకీయంగా పెనుదుమారమే రేపింది. పారదర్శకత, బాధ్యతతో వ్యవహరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇక గత నెల మన్‌-కీ-బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ సీబీఎస్‌ఈ వివాదం, పేపర్ లీకేజీల అంశాలను ప్రస్తావించకపోవడాన్ని రాహుల్ గాంధీ తప్పుబడుతూ ప్రశ్నించారు.లక్షలాది విద్యార్థుల జీవితాలు, వారి కుటుంబాలు నష్టపోయినప్పుడు ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదని రాహుల్ గాంధీ హితవు పలికారు.అయితే ప్రధాని మోదీ పదవిలో మరో ఏడాది పాటు మాత్రమే ఉంటారని జోస్యం చెప్పిన రాహుల్ గాంధీ కామెంట్స్ పై.. బీజేపీ ఇప్పటి వరకు ఇంకా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+