శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వసతి కష్టాలకు ఇక చెక్. అధునిక సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన రెండు వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకే సారి పది వేల మందికి వసతి కల్పించేలా నిర్మించిన వీటిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల వేళ ఈ కొత్త సముదాయాలను ప్రారంభించేలా నిర్ణయించారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ 600 కోట్లు ఖర్చు చేసారు. వీటిలో వసతి సదుపాయం పొందే విధానం పైనా టీటీడీ స్పష్టత ఇస్తోంది.

తిరుపతి వచ్చే భక్తుల కోసం నూతన వసతి సముదాయం అందుబాటులోకి వస్తోంది. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన 'శ్రీపాదం', 'అచ్యుతం' వసతి సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు చివరి దశకు వచ్చాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు కలగనుంది. కాగా, రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వందే భారత్ డబుల్ డెక్కర్ రైలు వచ్చేస్తోంది - తొలిగా ఈ మార్గంలోనే..!!
వందే భారత్ డబుల్ డెక్కర్ రైలు వచ్చేస్తోంది - తొలిగా ఈ మార్గంలోనే..!!
cm-chandra-babu-to-inaugurate-sripadam-and-achyutam-devotee-accommodation-complexes-during-brahm

బ్రహ్మోత్సవాల వేళ ప్రారంభం

ఈ రెండు సముదాయాల నిర్మాణం 2024 మార్చి నెలలో పనులు ప్రారంభం అయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న వసతి గదులు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సరిపోవటం లేదు. అయితే.. తిరుపతిలో వసతి సౌకర్యం పెరిగితే.. భక్తులకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. 2022 లోనే ఈ రెండు కొత్త భవనాల నిర్మాణం పైన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతికి చేరుకునే భక్తులు చాలా మంది తిరుమలలో భక్తులు దొరకని భక్తులు తిరుపతిలోనే గోవిందరాజుల సత్రంలో గదులు తీసుకునే వారు. అయితే అక్కడా గదులు వేగంగా ఫుల్ అవుతున్నాయి. క్రమంలో ఆ సత్రం స్థానంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాలను నిర్మించారు. ఈ రెండు భవనాలు అందుబాటు లోకి రావటంతో ఇక గదుల విషయంలో ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఒకే సారి దాదాపు 10వేలమందికి సరిపోయే విధంగా వసతి గదులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గదులను ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లోనే పొందే విధంగా వచ్చే నెల భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+