'రంభ ఊర్వశి మేనకా' టీజర్ రివ్యూ: అల్లరి నరేష్ కు ఈసారి హిట్టు గ్యారంటీ..!

అల్లరి నరేష్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అన్నట్లే.. క్రేజీ కాన్సెప్ట్స్ తో కడుపుబ్బా నవ్వించే హీరో అల్లరి నరేష్. అందుకే అల్లరి నరేష్ సినిమాలంటే బయ్యర్లు ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. అలా అల్లరి నరేష్ సినిమాలకు బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే అల్లరి నరేష్ ఇటీవలికాలంలో కామెడీ సినిమాలను పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ తనలోని వైవిధ్యమైన నటనను బయటకు తీస్తున్నారు. మొదటి నుంచి కామెడీ సినిమాలతో అలరించిన ఆయన 2021 లో వచ్చిన నాంది సినిమాతో రూటు మార్చారు. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది.

ఓటీటీలోకి విజయ్ 'జన నాయగన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఓటీటీలోకి విజయ్ 'జన నాయగన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

అలా 2022 లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, 2023 లో ఉగ్రం, 2024 లో బచ్చలమల్లి, 2025 లో 12ఏ రైల్వే కాలనీ తదితర ఆసక్తికర సినిమాలతో అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి చాలా గ్యాప్ తర్వాత కామెడీ మూవీ చేస్తున్నారు అల్లరి నరేష్. అదే 'రంభ ఊర్వశి మేనకా'.. చాలా ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ మూవీ నుంచి తాజాగా వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆసక్తి పెంచిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ ను విడుదల చేసి సినిమా కథపై ఆసక్తికరమైన క్లూ ఇచ్చింది.

స్వర్గంలో ఉండే దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనకా అసలు భూమి మీదకు ఎందుకు వస్తారు..? వారి రాకతో నరేష్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? అనే క్రేజీ అంశాలతో ఈ టీజర్ ఆసక్తికరంగా సాగుతోంది. టీజర్ ను బట్టి చూస్తే ఓ మాయా పుస్తకం చుట్టూ కథ తిరగనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ పుస్తకం ద్వారా ఇంద్రలోకం తెరుచుచుకుంటుందని అలా రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి తీసుకురావచ్చని ఈ టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది. ఇక నరేష్ ప్రయత్నం ఫలించి ఆ దేవ కన్యలు భూమి మీదకు దిగడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.

AllariNaresh Rambha Urvasi Menaka Teaser Review A guaranteed hit for Allari Naresh this time

ఈ చిత్రానికి చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. 'రంభ ఊర్వశి మేనకా' లో వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో తనదైన కామెడీతో అలరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 4 న థియేటర్లలో విడుదల కానుంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+