బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!

విజయవాడలో కేశినేని (Kesineni)బ్రదర్స్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికలకు ముందే టీడీపీని వీడి వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో అన్నతో విభేదించి, ఆయన స్ధానంలో టీడీపీ టికెట్ తెచ్చుకుని గత ఎన్నికల్లో తొలిసారి ఎంపీ అయిన కేశినేని చిన్ని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కేశినేని చిన్ని అవినీతిపై నాని అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా తాతినేని రాంబాబు అనే ఓ అనుచరుడు పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడంతో అతనిపై ఎంపీ చిన్ని ఆఫీసు వర్గాలు పోలీసుల్ని ఆశ్రయించాయి.

త్వరలో విశాఖ-విజయవాడ బుల్లెట్ ట్రైన్..? రైల్వే మంత్రి సమాచారం..!
త్వరలో విశాఖ-విజయవాడ బుల్లెట్ ట్రైన్..? రైల్వే మంత్రి సమాచారం..!

దీంతో మాజీ ఎంపీ కేశినేని నాని ఈ వ్యవహారాన్ని ట్వీట్ ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తాను దాదాపు రెండు సంవత్సరాలుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, అయినప్పటికీ, ఏమాత్రం రాజకీయ ప్రమేయం లేని తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రామ్ బాబుపై, ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతోనే అన్నట్లు తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు బనాయిస్తున్నారని, టాస్క్ ఫోర్స్ పీఎస్ఐ శ్రీ నవీన్ (విజయవాడ) (మొబైల్ నంబర్ 9542042118) ఆయన ఇంట్లో లేని సమయంలో వెళ్లి, ఆయన తల్లిని వేధించారని నాని ట్వీట్ చేసారు. ఈ ఘటన ఒక అమాయక కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని, ఈ వేధింపులను అరికట్టడానికి, రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా చూడటానికి జోక్యం చేసుకోవాలని కోరారు.

Kesineni Clan War Flares in Vijayawada Nani vs Chinni Chandrababu Holds Key

సర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులపై సర్కార్ కీలక నిర్ణయం-ఉత్తర్వులు..!
సర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులపై సర్కార్ కీలక నిర్ణయం-ఉత్తర్వులు..!

ఆ తర్వాత ఫేస్ బుక్ లో సోదరుడు కేశినేని చిన్ని అనుచరుల్ని ఉద్దేశించి నాని స్వయంగా ఓ పోస్టు పెట్టారు. చిన్నిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ అనే వార్తను కూడా దీనికి ట్యాగ్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్ములో సుమారు రూ.27 కోట్ల బ్లాక్ మనీ దొంగతనం వ్యవహారానికి సంబంధించి, ఆయన పీఏలు మరియు కార్యాలయ సిబ్బంది (మోహన్! , పొన్నం రాజేష్!, రామచంద్ర!, అంజి! హైదరాబాద్ నాగ శ్రీనివాసు!) కొందరు పరారీలో ఉన్నారని నాని తెలిపారు. అలాగే, ఆ సొమ్ము రికవరీకి సంబంధించిన పరిణామాల్లో భాగంగా, కేశినేని చిన్ని సమక్షంలోనే కొందరు సన్నిహితులు పరారిలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకువచ్చి అతని చేతులపై యాసిడ్ పోశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారిక సమాచారం, ఇతర ఆధారాలు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+