Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Zakia Khanam: టీడీపీని కాదని బీజేపీలో చేరిన వైసీపీ ముస్లిం ఎమ్మెల్సీ.. !

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపికై ఆ తర్వాత శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ కూడా పనిచేసిన జకియా ఖానం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒకే రోజు ఆమె రెండు సంచలనాలు రేపారు. ఇందులో ఒకటి ఇన్నాళ్లూ తాను పనిచేసిన వైసీపీకి ఇప్పుడు అకారణంగా గుడ్ బై చెప్పడం అయితే టీడీపీలో చేరడానికి బదులు బీజేపీలో చేరిపోవడం మరొకటి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా నేత జకియా ఖానంకు ఆ పార్టీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ కూడా చేసింది. జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఆమెకు ఈ పదవి దక్కింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె వైసీపీకి దూరం కావడం ప్రారంభించారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిశారు. వారితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. దీంతో ఆమె టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.

ysrcp mlc zakia khanam joined bjp surprisingly instead of tdp- here is why

టీడీపీలో చేరతారని భావించిన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం ఇవాళ అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో ముస్లిం వర్గాలు బీజేపీకి క్రమంగా దూరమవుతున్న వేళ జకియా ఖానం ఇలా అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ నినాదం సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ పార్టీలో కుల మతాలకు తావు లేదని తెలిపారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అన్నారు. శాసన మండలి వైస్ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసి జకియా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందన్నారు.

మరోవైపు జకియా ఖానం ఇలా టీడీపీని కాదని బీజేపీలో చేరడం వెనుక కూటమి వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఈ ముస్లిం ఎమ్మెల్సీని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపడం కాషాయ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎలాగో మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో బీజేపీకి ఆ పదవి ఇచ్చేందుకు వీలుగా జకియా ఖానంను ఇలా తమ పార్టీలో చేర్చుకున్నట్లు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+