ఏపీలో పతంజలి భారీ పెట్టుబడులు.. 22వేలమందికి ఉపాధి, ఆ జిల్లాకు పండుగే!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని ప్రగతి బాట పట్టించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం . ఏపీ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ప్రముఖ ఆయుర్వేద మరియు ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) దిగ్గజం 'పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్' భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. విజయనగరం జిల్లాలో సరికొత్తగా ఒక సమగ్ర ఫుడ్ అండ్ హెల్త్ పార్క్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

దాదాపు రూ.370.10 కోట్ల భారీ పెట్టుబడి

ఇందుకు సంబంధించి దాదాపు రూ.370.10 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ నుంచి త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని పతంజలి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.పతంజలి సంస్థ ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Patanjali Ayurveda Limited proposes a Food and Health Park Andhra Pradesh with huge investment

22,000 మందికి ఈ పార్క్ ద్వారా ఉపాధి

ప్రత్యక్షంగా దాదాపు 2,000 మందికి, పరోక్షంగా సుమారు 20,000 మందికి.. మొత్తంగా 22,000 మందికి ఈ పార్క్ ద్వారా ఉపాధి కల్పిస్తామని సంస్థ పేర్కొంది. నిజానికి, ఈ పెట్టుబడి ప్రతిపాదనలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే (2014-2019) తెరపైకి వచ్చాయి. ఆ సమయంలో విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా పతంజలి సంస్థకు 172.85 ఎకరాల భూమిని కూడా కేటాయించారు.

దాదాపు రూ.1,000 కోట్లతో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ యోచన

అప్పట్లో దాదాపు రూ.1,000 కోట్లతో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్, పశువుల బ్రీడింగ్ సెంటర్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలని భావించారు. అయితే, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. దాదాపు ఐదేళ్ల నిరీక్షణ అనంతరం, పతంజలి సంస్థ ఈ కేటాయించిన భూమిలోనే సుమారు 92.84 ఎకరాల పరిధిలో ఫుడ్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు సరికొత్త ప్రతిపాదనలతో మళ్లీ సిద్ధమైంది.

సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేదికాదు, కేటీఆర్ వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్
సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేదికాదు, కేటీఆర్ వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్

స్థానిక రైతులకు తమ పంటలకు మంచి మద్దతు ధర

ఉత్తరాంధ్ర పరిధిలో పండే పప్పు దినుసులు, తృణధాన్యాలు, నిమ్మకాయలు, మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను సేకరించి, ఈ పార్క్‌లోనే ప్రాసెస్ చేయనున్నారు. దీనివల్ల స్థానిక రైతులకు తమ పంటలకు మంచి మద్దతు ధర లభించడమే కాకుండా మార్కెటింగ్ ఇబ్బందులు తప్పుతాయి. 2028 మార్చి నాటికి ఈ పార్క్ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలని పతంజలి సంస్థ డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+