చాక్లెట్ కొనిస్తామని ఎనిమిదేళ్ల చిన్నారిని గ్యాంగ్ రేప్..

ఏళ్లు గడుస్తున్నా.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి బలి అవుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మహిళలకు, చిన్నారులకు నానాటికీ రక్షణ కరవు అవుతూనే ఉంటుంది. ఈ తరహా ఘటనే తెలంగాణలోని సంగారెడ్డిలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి మండలం ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట అడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు దుర్మార్గులు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి దుండగులు పారిపోయినట్టు చెబుతున్నారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Eight-year-old girl gang-raped incident took place in sangareddy

అయితే దుండగులు సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి. ఇద్దరిని పట్టుకుని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట కాలనీ వాసుల ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింపజేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+