ఎన్నికల కోడ్ ఉల్లంఘన: కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని టీహబ్‌లో యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించడంతోపాటు ఎన్నికల ప్రచారం కోసం టీహబ్‌ను వాడుకున్నారని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార హోదాను దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేగాక, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.ఇది ఇలావుండగా, అమరవీరుల ప్రాంగణంలో ఇటీవల కేటీఆర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెందిన భవనంలో ఇంటర్వ్యూ నిర్వహించారని.. కాంగ్రెస్ నేత నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఓ వికాస్ రాజ్ ఈ ఫిర్యాదును హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించారు.
ఈ క్రమంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఈ ఫిర్యాదు చేరడంతో.. వారు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పోలీసులకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తులో అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినందుకు నిర్వాహకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేగాక, ఈ ప్రదేశంలో ఇంటర్వ్యూతోపాటు డ్రోన్ ఎగురవేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రోన్ ఎగురవేసిన నిర్వాహకుడు ఎవరనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. రాజకీయ నాయకులు ప్రభుత్వ సంస్థలను వారి కార్యకలాపాల కోసం వినియోగించుకోరాదని పోలీసులు స్పష్టం చేశారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications