జూబ్లీహిల్స్ తొలి ఫలితం, గెలుపు ఖాయమైనట్లే..!!
జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది. రాజకీయంగా జూబ్లీహిల్స్ ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. హోరా హోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక ఫలితం పైన ఇప్పటికే సర్వే సంస్థలు తమ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. కాగా, ఆ ఫలితాల తరువాత పార్టీలు పోలింగ్ సరళి ని పూర్తి స్థాయి లో విశ్లేషించాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, అధికారులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పార్టీల ఏజెంట్లకు మార్గనిర్దేశం పూర్తయింది. దీంతో, జూబ్లీహిల్స్ లో తొలి ఫలితం కోసం కౌంట్ డౌన్ మొదలైంది.
జూబ్లీహిల్స్ లో విజేత ఎవరో తెలిసేందుకు మరి కొద్ది గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. పది రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలో లక్షా 94 వేల 632 ఓట్లు పోలయ్యాయి. వీటిని పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోం ఓటింగ్‌లను లెక్కించిన తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు.

కాగా, ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కాగా కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికితోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో 24గంటల పహారా ఉండనుంది. స్టేడియానికి 100 మీటర్ల మేరలో ఆంక్షలు ఆమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 47.49 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సర్వేలు అన్నీ తమ వైపే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా.. సైలెంట్ ఓటింగ్ జరిగిం దని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. జూబ్లీహిల్స్ తుది ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications