వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2.73కోట్ల ఓటర్లు: లెక్క తేలింది, ఓటర్ల జాబితా సిద్ధం చేసిన ఈసీ, ఆ తర్వాతే విడుదల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.

అంతా సిద్ధం

అంతా సిద్ధం

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఈ జాబితాను ప్రకటించనుంది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని, అనుమతి కోసం వేచి చూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

2.73కోట్ల ఓటర్లు

2.73కోట్ల ఓటర్లు

సిద్ధం చేసిన జాబితా ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 73 లక్షల 18 వేల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,37,87,920 మంది కాగా, మహిళా ఓటర్లు 1,35,28,020 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,663 మంది, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఓటర్లు 9,451 మందిగా ఈసీ లెక్కతేల్చింది.

అందుకే ఆలస్యం

అందుకే ఆలస్యం

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, సుమారు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో జాబితా విడుదల ఆలస్యమైంది.

ఈసికి నివేదిక

ఈసికి నివేదిక

కాగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తుది జాబితా విడుదలకు ఈసీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఈసీకి నివేదించింది. ఈసీ అనుమతి రాగానే తుది జాబితాలు ప్రచురిస్తామని తెలిపారు రజత్ కుమార్.

English summary
Election Commission to release electoral rolls for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X