ఎన్నికల కోడ్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఎందుకంటే

తెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాను కోరిన తెలంగాణా ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది ఈసీ .దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే పనిలో పనిగా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈసీఐ అనుమతి కోరింది. మార్చి 13, 22వ తేదీల్లో రెండు సార్లు ఈసీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ లేఖకు స్పందించిన ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఓకే చెప్పింది .

ఎన్నికలు నిర్వహించినప్పటికీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాతే స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడించాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Election of local bodies while the election code is ...

పనిలో పనిగా అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుంటే పాలన కుంటుపడకుండా పని చెయ్యవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం . ఇప్పటికే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ఆటంకం కలగడంతో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మరోసారి ఆటంకం కలగకూడదని కోడ్ ఉన్నప్పుడే ఎన్నికలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు గులాబీ బాస్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+