వర్షాకాలం వేసవిని తలపించిన విద్యుత్ డిమాండ్.. కీలక విషయాలు చెప్పిన డిప్యూటీ సీఎం!

తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగంపైనే కాక, అనేక రంగాల పైన పడుతోంది. అయితే ఈ పరిస్థితుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఊహించని విధంగా వచ్చిన ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు.

వేసవిని తలపిస్తూ వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్

అంతర్జాతీయంగా 'ఎల్ నినో' సవాళ్లు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈసారి వర్షాకాలంలో గతానికి భిన్నంగా నమోదైన విద్యుత్ డిమాండ్ విద్యుత్ శాఖకు ఒక షాక్ అని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలోనూ వేసవిని తలపిస్తూ 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనా, అదనంగా వచ్చిన 7,000 మెగావాట్ల భారాన్ని విజయవంతంగా తట్టుకుని నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించామన్నారు.

Electricity demand in monsoon like summer with el nino Deputy CM Bhatti vikramarka said key details

ఎక్కడా పవర్ కట్ లు లేవు

రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అవుతున్న 2 వేల మెగావాట్ల జల విద్యుత్ నిలిచినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. గతంలో వర్షాకాలంలో 11 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండేదని, ఇది ఒక్కసారిగా 16,500 కు పెరిగిందని అయినా సరే ఎక్కడ పవర్ కట్ లు లేకుండా విద్యుత్ సరఫరా చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా 'ఎలక్ట్రిసిటీ అంబులెన్స్'

ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజా బాట', 'పొలం బాట' కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదల సంక్షేమంలో భాగంగా 53 లక్షల కుటుంబాల ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాన్ని ఆర్థిక శాఖే భరిస్తోందని చెప్పారు. సాంకేతికత ఉపయోగంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా 'ఎలక్ట్రిసిటీ అంబులెన్స్' సేవలను మరియు 1912 హెల్ప్‌లైన్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు.

విద్యుత్ ప్రమాదాల్లో మరణిస్తే కోటి ప్రమాద భీమా

విద్యుత్ ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు సిబ్బంది మరణిస్తే ఇచ్చే ప్రమాద భీమాను కోటి రూపాయలకు పెంచినట్లు ప్రకటించారు. అప్పుల రీస్ట్రక్చరింగ్ తో డిస్కంలను నంబర్-1గా తీర్చిదిద్దే ప్రణాళికలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తెలంగాణా సర్కార్ దానిని దీటుగా ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q