రవీంద్ర భారతిలో విద్యుత్ ఉత్సవాలు.!సీఎం చొరవతోనే 24గంటల కరెంట్ సాద్యమైందన్న తలసాని.!
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 22 వరకూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని నివేదిస్తూ రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం తలపించింది. అందులో బాగంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో విద్యుత్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి హాజరుకానున్నారు. ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టి యస్ ఎస్ పి డి సి యల్ సియండి రఘుమా రెడ్డి, యన్ పి డి సి యల్ సి యం డి గోపాలరావుతో పాటు ఇతర సిఎండీలు, డైరెక్టర్లు, ఇంజనీర్లు, సిబ్బంది కూడా హాజరవుతారు.

అంతే కాకుండా విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా అందివ్వగలుగుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మారేడ్ పల్లిలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలు అనేక అవస్థలు పడేవారని మంత్రి గుర్తు చేసారు.
వేసవి వచ్చిందంటే విద్యుత్ కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విజన్ తో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని మంత్రి వివరించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల విద్యుత్ అందించడంలో విఫలం చెందారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications