కెసిఆర్ మొండి వైఖరి: ఎర్రబెల్లి, చంపాలని కుట్ర చేశారు: నాయిని గ్రేటర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో రైతులు నష్టపోయారని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం నాడు మండిపడ్డారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితుల పైన టిఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆరోపించారు.
కేంద్ర కరువు బృందం తెలంగాణలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయంలో కేంద్ర కరువు బృందాన్ని తెలంగాణ టిడిపి నేతలు కలిశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ మొండి వైఖరితో రైతులు నష్టపోయారన్నారు. పంటల బీమాను పెంచడంతో పాటు ఉపాధి హామీ రోజులను పెంచాలని తాము కేంద్ర బృందాన్ని కోరామని చెప్పారు.

నాయిని నర్సింహా రెడ్డి సవాల్
ప్రతిపక్ష నేతలకు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం నాడు సవాల్ విసిరారు. దమ్ముంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగాలన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కేసీఆర్‌ను హత్య చేయడానికి సీమాంధ్ర గూండాలు కుట్రలు పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. అరవై ఏళ్ల చరిత్రను కేవలం 18 నెలల పాలనలో మరిపించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆయన అడిక్‌మెట్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ మేయర్ పీఠం టీఆర్‌ఎస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని చెప్పారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications