నయీం నన్నే బెదిరించాడు, డ్రైవర్‌ను కిడ్నాప్ చేశాడు, కిరణ్ రెడ్డికి చెప్పా: ఈటెల
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గతంలో ఫోన్లో తననే బెదిరించాడని, తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేశాడని మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. ఈ విషయాన్ని తాను నాటి సీఎం కిరణ్‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు.
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గతంలో ఫోన్లో తననే బెదిరించాడని, తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేశాడని మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. ఈ విషయాన్ని తాను నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు.
ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తాను మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. అలాంటి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు నయీం విషయంలో తమ పైన విమర్శలు చేయడాన్ని ప్రజలు హర్షించరని ఈటెల అన్నారు.

అక్రమాలపై సభాసంఘం వేయాలి: భట్టి
మిషన్ భగీరథలో అక్రమాలు జరుగుతున్నందున వెంటనే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క వేరుగా డిమాండ్ చేశారు.
టెండర్ల విధానంలో కూడా అక్రమాలు జరిగాయని మిషన్ కాకతీయలోనూ ఈ-ప్రొక్యూర్ విధానంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. వీటిపై ఎలాంటి సమాధానం చెప్పకుండానే సభ వాయిదా వేయడం దుర్మార్గమఅన్నారు. అక్రమాలపై సీబీసీఐడీతో దర్యాప్తు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications