రేవంత్ మాట తప్పారు.. కేసీఆర్‌లానే: తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనన్న ఈటల

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్వలు గుప్పించారు మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. మల్కాజిగిరిలో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సూచనలను ప్రభుత్వాలు పాటించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌లానే తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని ఈటల రాజేందర్ కాంగ్రెస్‌​పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీని ముట్టుకుంటారా? అని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదన్నారు.

Etela Rajender hits out at congress and cm revanth reddy responded on Phone Tapping Case

ప్రధాని మోడీని పెద్దన్న అన్న సీఎం రేవంత్​ రెడ్డి.. వెంటనే మళ్లీ మోడీ ఏంటీ అని మాట్లాడటం సరికాదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకింత మెజార్టీ వచ్చి, అరుదైన అవకాశం వస్తుందని కాంగ్రెస్ నాయకులు అనుకోలేదని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఇప్పటికీ రాలేదని మండిపడ్డారు.

మహాలక్ష్మీ పేరిట నగదు సాయం అమలు కావడం లేదన్నారు ఈటల రాజేందర్. రైతు భరోసా, కౌలు రైతులకు సాయం రైతులకు బోనస్‌ ఇస్తామన్నారు కానీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కడియం శ్రీహరిని దళితుడు కాదన్న రేవంత్ రెడ్డి.. మళ్లీ అతని కుమార్తెకు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరపాలన్నారు.

మాట మార్చిన రేవంత్, కాంగ్రెస్

రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు వెంటనే అనర్హులవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు.. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుందని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్‌, హామీలు ఎలా అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించడానికే గ్యారెంటీలు ప్రకటించిందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదన్నారు ఈటల. తెలంగాణలో 17 సీట్లు గెలిచినా.. కాంగ్రెస్‌ 60 ఎంపీ స్థానాలకు మించదు. తెలంగాణలో 17 సీట్లు గెలిచి రాహుల్‌ ప్రధాని ఎలా అవుతారు? అధికారంలోకి రాలేని కాంగ్రెస్‌, హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను వంచించడానికే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+