కరీంనగర్‌లో పోలీస్ శాఖపై ఈటెల
కరీంనగర్‌లో పోలీస్ శాఖపై ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను ఆధునికరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించతలపెట్టిన ఏసిబి కార్యాలయం భవన నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో త్వరలో వినూత్న మార్పులు రానున్నాయిని, దీనిలో భాగంగా..ఈ శాఖలో ప్రత్యేక జీవోలను విడుదల చేసి ప్రక్షాళన చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అవీనితిని నిర్మూలించేందుకు ఏసిబిని బలోపేతం చేయడం..దీనిలో భాగంగానే నిధులను విడుదల చేయడం జరుగుతుందని ఈటెల రాజేందర్ తెలిపారు.












Click it and Unblock the Notifications