టీడీపీతో బీజేపీ పొత్తుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం, వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని పావులు కదుపుతున్నారని, అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయంపై స్పందించారు.

ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదు బీజేపీ: ఈటల రాజేందర్

ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదు బీజేపీ: ఈటల రాజేందర్


తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిజెపి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదని, సొంతంగా బలపడే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో బీజేపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఖమ్మం సభ పైన వ్యాఖ్యలు చేసిన ఆయన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయి అని చెప్పారు. టిడిపి ఏమి నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

తెలంగాణాతో టీడీపీకి సంబంధం ఉంది.. ఎగిరేది కాషాయ జెండానే

తెలంగాణాతో టీడీపీకి సంబంధం ఉంది.. ఎగిరేది కాషాయ జెండానే


తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఆయన దేశంలో ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంతో టిడిపికి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పిన ఈటల రాజేందర్ తాము ఏ పార్టీ పైన ఆధారపడమని, సొంతంగా బలోపేతం అవుతామని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ఖమ్మం సభపై సానుకూలంగా మాట్లాడిన ఈటల .. సంకేతం ఏంటి?

చంద్రబాబు ఖమ్మం సభపై సానుకూలంగా మాట్లాడిన ఈటల .. సంకేతం ఏంటి?

అయితే చంద్రబాబు పైన, ఖమ్మం సభ పైన సానుకూలంగానే మాట్లాడిన ఈటల రాజేందర్ వ్యవహార శైలి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమా అన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. చంద్రబాబు పార్టీ తెలంగాణాలో కార్యక్రమాలు నిర్వహించుకోవటం తప్పేమీ కాదన్న ఈటల ఈ వ్యవహారంపై ఆచి తూచి మాట్లాడారు. తాము ఎవరి మీద ఆధారపడం అని చెప్తూనే చంద్రబాబు ఖమ్మం సభను సమర్ధించారు. చంద్రబాబు సభపై ఈటల సానుకూలంగా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూ, టిడిపి అధినేత చంద్రబాబు చుట్టూ తిరగడం ప్రధానంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+