ప్రధాని మోడీతో రేవంత్ దోస్తీ!

రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళు నిలిచిపోవడం రైతులు ఆందోళనకు గురి అవుతున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులతో మాట్లాడిన మాజీమంత్రి హరీష్ రావు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి ప్రతి చిన్న దానికి ఢిల్లీ వెళ్తున్నాడు
కపాస్ కిసాన్ యాప్ వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో రైతులు దళారులకు పత్తి నష్టాలకు అమ్ముకుంటున్నారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న దానికి ఢిల్లీ వెళుతున్నారని, మోదీతో దోస్తీ చేస్తున్నాడని అన్నారు. ప్రధానితో మాట్లాడి.. పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న కిసాన్ యాప్ రద్దు చేయాలని సూచించారు.

ex minister harish rao slams revanth reddy friendship with pm modi about cotton farmers problems too

కేంద్రం నిర్ణయాలతో రైతులకు నష్టం
గతంలో కొనుగొలు చేసిన విధానంలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ నిబంధనలను సవరించి పత్తి కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన నిబంధనలు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని, రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. రైతులపై లాఠీచార్జీలు, ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఏడాది పాటు విజయోత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు.

రేవంత్ విజయోత్సవాలు ఇందుకేనా
రైతులను మోసం చేసినందుకు సకాలంలో యూరియా ఇవ్వనందుకు విజయోత్సవాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమీక్షలు ఎప్పుడు కలెక్షన్ల పైన తప్ప రైతుల సమస్యల పైన కాదని ఎద్దేవా చేశారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బోనస్ ను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరపాలని రైతుల సమస్యలను అర్థం చేసుకొని కేంద్రం ఇప్పటికైనా దిగి రావాలన్నారు.

అలా చెయ్యకుంటే నివాసాలు ముట్టడిస్తాం
తేమ శాతాన్ని సవరించి పత్తి కొనుగోలు చేయాలని హరీష్ రావు అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించని పక్షంలో జూబ్లీహిల్స్ నివాసాలను ముట్టడిస్తామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. రైతుల మంచి కోరే పార్టీ, రైతుల పక్షాన ఉద్యమించే పార్టీ బీఆర్ఎస్ అన్నారు.ఇటీవల వరంగల్ వచ్చే తుఫాను బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి, వారికి వరద సహాయం అందించడంలో కూడా విఫలమయ్యాడని హరీష్ రావు ఆరోపించారు.

తుగ్లక్ నిర్ణయాలతో రైతులకు నష్టం చేస్తే ఊరుకోం
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ ముంపుకు గురవుతుందన్నారు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం 15వేల రూపాయలను సహాయం చేయాలన్నారు. కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ నిబంధన ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో రైతులకు నష్టం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+