Ponnala Lakshmaiah: కాంగ్రెస్ కు పొన్నాల గుడ్ బై, టార్గెట్ రేవంత్ - బీఆర్ఎస్ లోకి ఎంట్రీ..!!
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు భారీ షాక్. పీసీసీ మాజీ చీఫ్..బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేసారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాసారు. జనగామ సీటు విషయంలో పొన్నాలను పక్కన పెట్టటం పైనా ఆగ్రహంతోనే పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి పొన్నాలకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ను వీడిన పొన్నాల:కాంగ్రెస్ సీనియర్ నేత..పీసీసీ మాజీ చీఫ్..మాజీ మంత్రి పొన్నాల కాంగ్రెస్ ను వీడారు. తెలంగాణలో అధికారం ఖాయమని పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ ఇది భారీ షాక్ గా మారింది. పొన్నాల తొలి నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. వైఎస్సార్ కేబినెట్ లో వరుసగా రెండు దఫాలు మంత్రిగా పని చేసారు. తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం సీట్ల ఖరారు పైన కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే సీట్లు ప్రకటించేందుకు రంగం సిద్దమయింది. ఈ సమయంలో పొన్నాల తాను సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన జనగామ సీటు మరొకరికి కేటాయించాలని నిర్ణయంచటం పైన ఆగ్రహంతో ఉన్నారు.

పార్టీని అమ్మేస్తున్నారు:పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత లేదంటూ ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల పేర్కొన్నారు. కొత్తగా పా్టతీలోకి వచ్చిన వాళ్లు భూములు..విల్లాలు ఇస్తే వారికి సీట్లు ఇస్తున్నారని ఆరోపణలు చేసారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని లేఖలో స్పష్టం చేసారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతండటంతో పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తన లేఖలో వివరించిన పొన్నాల..బాధతోనే పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. పీసీసీ చీఫ్ రేవంత్ తీరు పైన లేఖలో పొన్నాల మండిపడ్డారు. కాంగ్రెస్ మూల సిద్దాంతం సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీని అమ్మేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు.
బీఆర్ఎస్ లో చేరిక:ఇక, పొన్నాల బీఆర్ఎస్ లో చేరాలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానిస్తారని సమాచారం. బీసీ నేతగా పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించటంతో పాటుగా జనగామ సీటు ఇస్తారా లేక మరేదైనా హామీతో పొన్నాలను చేర్చుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. జనగామ సీటు కోసం బీఆర్ఎస్ లోనూ పంచాయితీ జరిగింది.
పార్టీ నాయకత్వం అక్కడి వ్యవహారాన్ని సెట్ చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డికి సీటు ఖాయమనే ప్రచారం వేళ ..పొన్నాల అంశం తెర మీదకు వచ్చింది. దీంతో, బీఆర్ఎస్ లో పొన్నాలకు సీటు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అభ్యర్దుల జాబితా ప్రకటించిన తరువాత కాంగ్రెస్ లో ఇంకా ఎవరైనా ఇదే బాట పట్టే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications