అయ్యయ్యో.. అపర చాణిక్యుడు కేసీఆర్ అస్తిత్వ పోరాటం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం అపర చాణిక్యుడుగా పేరుగాంచిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేస్తుంది. నా వాళ్ళు అని నమ్మిన ప్రతి ఒక్కరు మోసం చేసి వెళుతుంటే కెసిఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రాజకీయాలలో అవకాశవాదం తప్ప, విలువలు ఉండవు అనేది కెసిఆర్ కు బాగా తెలుసు.

నమ్మి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వారు సైతం, పదవులను ఎంజాయ్ చేసిన వారు సైతం, కష్టకాలంలో పక్కన ఉండకుండా మోసం చేసి వెళుతుంటే కెసిఆర్ దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. మీకేం తక్కువ చేశానని, ఎందుకింత మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉనికి కోసం పోరాటం కనిపిస్తుంది.

Existential struggle for KCR to protect BRS party

పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరుగా పక్క పార్టీలకు జంప్ అవుతుండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. టికెట్ ఇచ్చిన వారు కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్న తీరు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. ఒకప్పుడు టికెట్ కోసం పోటీ పడిన పార్టీలో ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం, బాబ్బాబు అంటూ అభ్యర్థులుగా ఉండాలని బ్రతిమాలుకునే పరిస్థితి బిఆర్ఎస్ అధినేతకు ఆందోళన కలిగిస్తుంది.

బయట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏ పార్టీ చూడనంత పతనాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెరసి పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

బాగా నమ్మిన నేతలు కేశవరావు, కడియం శ్రీహరి వంటి నాయకులు కూడా మోసం చేసి పోతుంటే ఆయన ఆందోళన చెప్పనలవి కాకుండా ఉంది. అన్ని అవకాశాలు, పదవులు ఇచ్చినా ఇలా ఎలా వెళ్ళిపోతున్నారు. మోసం ఎలా చెయ్యగలుగుతున్నారు అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ వెన్నుపోటు రాజకీయాలు తట్టుకోలేకపోతున్నారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని గులాబీ అధినేత ప్రయత్నం చేస్తున్న క్రమంలో, పక్క పార్టీలు మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తుంది. అస్తిత్వం కోసం కేసీఆర్ పోరాటం చేసేదాకా పరిస్థితి మారింది. అతి తక్కువ కాలంలో ఉద్దాన పతనాలు చూసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందని చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో తనను తానే మేటిగా చెప్పుకున్న కేసీఆర్ కు సొంత పార్టీ నేతల రాజకీయం కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+