Exit poll ABP C-Voter: తెలంగాణలో సీట్లను సమంగా పంచుకున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 0
దేశ వ్యాప్తంగా బీజేపీ-ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ స్థానాలను కట్టబెట్టిన ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ నెలకున్నట్లు తేల్చాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దాదాపు చెరి సగం సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని సర్వేలు బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని తేల్చాయి.
ఏబీపీ సీ ఓటర్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్
తాజాగా, వెలువడిన ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 7-9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, బీజేపీకి కూడా 7-9 నుంచి సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేల్చింది. ఎంఐఎం పార్టీకి ఒక సీటు వస్తుందని పేర్కొంది.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 4-7 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే, బీజేపీ మాత్రం 9 - 12 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఇలా..
తెలంగాణా లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీకి 7-10 సీట్లు, దాదాపు 37% ఓట్ల వాటాను అంచనా వేసింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు దాదాపు 34% ఓట్లతో 5-8 సీట్లు రావచ్చు.
భారత్ రాష్ట్ర సమితి (బీర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)తో సహా ఇతరులు 3-5 సీట్లు సాధించవచ్చని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్‌కి 21%, ఏఐఎంఐఎంకి 3% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
తెలంగాణలో ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్
ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పేర్కొంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేసింది. ఇక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ తర్వాత స్థానంలో ఉంది.
బీజేపీకి 8 నుంచి 9 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు
ఎంఐఎం పార్టీకి ఒక్క స్థానం
అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించేలా ఉన్నాయి. ఏది ఏమైనా జూన్ 4న విడుదలయ్యే అసలైన ఫలితాల కోసం వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications