హైదరాబాద్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లైఓవర్: అటుగా వెళ్తే ఓ లుక్కేయండి బాస్
హైదరాబాద్.. సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఫ్యూచర్ సిటీ దిశగా పరుగులు పెడుతోంది. దేశంలో నాలుగో అతిపెద్ద సిటీగా అవతరించిన భాగ్యనగరం ఫైనాన్స్, టెక్ రంగాల్లో హబ్ గా వెలుగొందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి అనేక అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను కొనసాగిస్తోన్నాయి.
కొత్తగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది. వరద బీభత్సాన్ని నుంచి విముక్తి పొందేలా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం ఇప్పటికే 375 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. మూసీ నది తీరాన్ని గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. అలాగే- గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ప్రఖ్యాత టవర్‌ను నిర్మించనుంది.

ఈ క్రమంలో సుందరీకరణ పనులపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా పీజేఆర్ ఫ్లైఓవర్‌ను అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దింది. స్పోర్ట్స్ థీమ్ తో మెరిసిపోతోందా ఫ్లైఓవర్. ఫుట్ బాల్ ను ప్రోత్సహించేలా.. అదే థీమ్ తో వేసిన వాల్ పెయింటింగ్.. దాని స్వరూపాన్నే మార్చివేసింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారుల చూపులను తన వైపు తిప్పుకొనేలా రూపుదిద్దుకుంది. ఫ్లైఓవర్ పిల్లర్లు రంగుల కాన్వాస్‌లుగా మారాయి.
శిల్పా లేఅవుట్ ఫేజ్ 2- గచ్చిబౌలిని అనుసంధానించడానికి నిర్మించిన ఆరు లేన్ల కారిడార్ ఇది. 2- క్యారేజ్ వేతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ ఐటీ హబ్‌లో వాహన ప్రవాహాన్ని క్రమబద్దీకరించినట్టయింది. ఈ ఏడాది జూన్ 28వ తేదీన ఈ ఫ్లైఓవర్‌పై రాకపోకలు ఆరంభం అయ్యాయి. ఇది అందుబాటులోకి వచ్చాక కొండాపూర్ - గచ్చిబౌలి జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలు మెరుగుపడ్డాయి. అస్తవ్యస్త ట్రాఫిక్ నుంచి కొంతలో కొంత ఉపశమనం కలిగింది వాహనదారులకు.












Click it and Unblock the Notifications