అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలోని గూడూరు మండలం టేకులతండాలో ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.
అక్రమ సంబంధమే ఆ మహిళ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్ారు. వినోద అనే ఆ మహిళను చంపిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

భార్యాభర్తలు ఇలా చేసుకుంటూ...
టేకులతండాకు చెందిన భూక్య వినోద (25), భర్త రమేష్ కూలీ పనులు చేసుకోవడమే కాకుండా భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు వారికి చరణ్, సాయి చరణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తండా పక్కనే ఉన్ అయోధ్యపురం గ్రామానికి చెదిన సీతారాంరెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు.

మోటార్ స్టార్టర్ దొంగతనం
వ్యవసాయ భూమికి నీరు అందించే బావికి ఉన్న మోటార్ స్టార్టర్ ఇటీవల చోరీకి గురైంది. దీంతో పంటలకు నీరు పారించడం అసాధ్యంగా మారింది. స్టార్టర్ అపహరణపై అనుమానం వచ్చి వారికి పక్కనే ఉన్న రూపురెడ్డి వెంకన్న, తుకనికి బొందాలు అనే రైతులను అడిగారు. వారిద్దరు కలిసి వినోడ, రమేష్ దంపతులతో గొడవకు దిగారు. ఆ సమయంలో కత్తి పొడిచి చంపుతాని బొందాలు వారిని బెదిరించాడు.

అతనికి ఫిర్యాదు చేశారు..
దాంతో బొందాలుపై వినోద, భర్త రమేష్, అత్తమామలు, కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ భూక్య వెంకన్నకు ఫిర్యాదు చేసారు. దాతో అపహరణకు గురైన స్టార్టర్‌ను తునికి బొందాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి సీతారాంరెడ్డి, వెంకన్న, బొందాలులు వినోద, రమేష్ దంపతులపై పగ పెంచుకున్నారు.

ఆ సమయం చూసి.
నాలుగు రోజుల క్రితం రమేష్ హైదరాబాదుకు కూలీ పనికి వెళ్లాడు. వినోద శనివారం ఉదయం మొక్కజొన్నకు నీళ్లు పెట్టడానికి వెల్లింది. వినోద వెంట ఆమె ఆరేళ్ల కుమారుడు సాయిచరణ్ ఉన్నాడు.ఉదయం పది గంటలకు ఇంటికి వచ్చిన వినోద, సాయిచరణ్ అన్నం తిన్నారు. ఆ తర్వాత వినోద నీళ్లు పెట్టేందుకు మళ్లీ పొలానికి వెళ్లింది.

అలా హత్య జరిగింది....
మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సాయిచరణ్ తల్లి వినోద చెప్పులు పట్టుకుని ఇంటికి వచ్చాడు. తల్లి ఏదని అడిగితే అతను ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత ఆమె మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తం మడుగులో కనిపించింది. తల, మొండెం వేర్వేరుగా పడేశారు.

ఆ ముగ్గురే చంపారు...
తమ కోడలు వినోదను సీతారాంరెడ్డి, తునికి బొందాలు, రూపురెడ్డి వెంకన్నలే చంపారని ఆమె అత్తామామలు చిలకమ్మ, హర్యానాయక్ ఆరోపించారు. ఇటీవల జరిగిన గొడవలో కత్తితో చంపుతానని తునికి బొందాలు బెదిరించిన విషయాన్ని వారు గుర్తు చేసారు. ముగ్గురు కలిసే చంపారని చిలుకమ్మ అంటోంది.

పోలీసుల అదుపులో నిందితుడు...
వినోదను చంపిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనతో కొంతకాలంగా వినోదకు వివాహేతర సంబంధం ఉందని, ఇటీవల తనను కాదని ఆమె మరొకరితో కలిసి తిరుగుతోందని, దానివల్లనే కత్తితో కోసి తానే చంపానని అతను గ్రామానికి చెందిన ఓ నాయకుడికి చెప్పాడని, ఆయన సూచనమేరకే అతను లొంగిపోయిట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications