ఫేస్‌బుక్ లవ్ అఫైర్, అసభ్యప్రవర్తన: అమ్మాయి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఫేస్‌బుక్ ప్రేమ వ్యవహారం విషాదానికి దారి తీసింది. ఈ సంఘటన ఆదివారంనాడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వెబ్‌సైట్‌ ద్వారా ఓ విద్యార్తిని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి ఆ విద్యార్థినిని మోసం చేశాడు.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత ఆమెను తిరస్కరించాడు. దాంతో మనస్తాపానికి గురైన అమ్మాయి జులై 27వ తేదీన బిపీ మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె సికింద్రబాదులోని జీడిమెట్లలో గల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

21 ఏళ్ల బాధితురాలు ఖమ్మం జిల్లాకు చెందిందని పోలీసులు చెప్పారు. ఆమె హాస్టల్లో ఉంటూ ఘట్కేసర్‌లోని ఓ కాలేజీలో ఈసిఈ చదువుతోంది. పాఠశాల స్థాయిలో ఆమె, నిందితుడు శ్రీనివాస నాయుడు (22) తరగతి సహచరులు.

Facebook love turns sour, girl attempts suicide

పాఠశాల విద్య ముగిసిన తర్వాత వారిద్దరు వేర్వేరు కాలేజీల్లో చేరారు. రెండేళ్ల క్రితం వారిద్దరు ఫేస్‌బుక్ ద్వారా తిరిగి సంబంధాల్లోకి వచ్చారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్ ఆమెకు హామీ ఇచ్చాడు. చింతల్‌లోని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అయితే, అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు బాధితురాలికి తెలిసింది. తాను అగ్రవర్ణానికి చెందినవాడినని, దిగువ కులానికి చెందినందువల్ల పెళ్లి చేసుకోవడం కుదరదని అతను ఆమెతో చెప్పాడు. బాధితురాలు జులై 2వ తేదీన అతని ఇంటికి వెళ్లింది. అతను పెళ్లికి నిరాకరించడంతో 90 బిపి టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+