వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతపు వసూళ్లు: ఇద్దరు నకిలీ మావోయిస్టుల అరెస్టు

|
Google Oneindia TeluguNews

వరంగల్: పెద్దపెల్లి జిల్లా పోలీసులు ఇద్దరు నకలీ మావోయిస్టులను అరెస్టుచేసి 32 రివాల్వర్‌, 13 లైవ్‌ రౌండ్స్‌, ఒక కారు, మూడు లక్షల రూపాయలు మరియు రెండు మోబైల్‌ ఫోన్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ సోమవారంనాడు విలేకరులతో మ్లాడుతూ మాజీ జనశక్తి కొరియర్‌. సుదర్శన్‌రెడ్డి అలియాస్‌ ప్రమోద్‌ను అరెస్టు చేసినట్లు ఈయన సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామస్తునిగా గుర్తించామని తెలిపారు.

మరొక నకలీ నక్సల్‌ను మొగుళ్లపల్లి కృష్ణమూర్తి (56) ఈయన పెద్దపల్లి జిల్లా వాసవీ నగర్‌కు చెందినవాడని, ఇతడు గతంలో జనశక్తి పార్టీ కొరియర్‌గా 1996-98వ సంవత్సరంలో పనిచేశాడని, ఆ తర్వాత సాధారణ జీవితం గడపాలని పోలీసులకు లొంగిపోయాడని విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు.

Fake Maoists arrested in Peddapally district

తర్వాత ఇతడు జనశక్తి నక్సలైట్లకు ార్గ్‌ెగా ఉన్నాడని, ఇతపై రెండుసార్లు జనశక్తి నక్సలైట్లు దాడి చేశారని తెలిపారు. తర్వాత అతని రక్షణ కొరకై ఒక ఆయుధాన్ని సమకూర్చుకొని హైదరాబాద్‌కు మకాం మార్చాడని తెలిపారు. మరో నక్సల్‌ై సుదర్శన్‌రెడ్డి దాదాపు 1.5 కోట్ల అప్పుల పాలు కావడంతో కృష్ణమూర్తితో స్నేహం నించి ఇద్దరు కలిసి మావోయిస్టు నక్సలైట్లుగా చెప్పుకొని స్థానికంగా ఉన్న వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేప్టారని కమిషనర్‌ తెలిపారు.

వీరిద్దరు ఎన్నో నేరాలు చేశారని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, హన్మకొండలో ఈ నేరాలు చేశారని కమిషనర్‌ దుగ్గల్‌ తెలిపారు. సమాచారం మేరకు పెద్దపల్లి పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు తాము అక్రమాలకు పాల్పడ్డామని ఒప్పుకున్నారని కమిషనర్‌ తెలిపారు.

English summary
Two fake Maoists arrested in Peddapalli district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X