ఎన్నికల వేళ.. నకిలీ పోలీసుల లీల; 18 లక్షలు దోపిడీ!!
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు అవుతుంది. ఈ క్రమంలో మద్యం, డబ్బు పంపిణీ కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీలను కూడా కొందరు కేటుగాళ్లు వాడుకుంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ అసెంబ్లీకి ఇంకా నెల రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఎన్నికల వేళ డబ్బులు పట్టుబడడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఇదే ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తనిఖీల పేరుతో దొరికినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో ఎన్నికల పేరుతో దోచుకున్న బాగోతం బయటకు వచ్చింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమిరేట్స్ వద్ద కొందరు వ్యక్తులు వాహన తనిఖీలు చేపట్టి ఆ దిశలో వచ్చిన కారును ఆపి తనిఖీలు చేసి 20 లక్షల రూపాయలు గుర్తించారు. బేగం బజార్ కు చెందిన ఒక వ్యాపారి డ్రైవర్ కు, మరొక ఉద్యోగికి డబ్బులు ఇచ్చి పంపించారు.
పోలీసుల పేరుతో చేసిన వాహన తనిఖీలలో వారి వద్ద నుండి 18 లక్షల రూపాయలు తీసుకుని కోటి మీదుగా సంతోష్ నగర్, చంపాపేట్ వైపుగా వెళ్లారు. అయితే తమ వద్ద డబ్బులు తీసుకు వెళ్లిన వ్యక్తులు ఎవరో తెలియకపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వాహన తనిఖీలలో పోలీసులు డబ్బులు తీసుకువెళ్లారు అన్న విషయాన్ని సదరు ఓనర్ కు తెలిపారు.
అయితే వారికి ఏ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకుని వెళ్లిపోవడంతో అనుమానించిన యజమాని సూచన మేరకు వారిరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వీరి వద్దనుండి డబ్బు కొట్టేసిన వారిలో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు పోలీస్ వాహనంలో వచ్చినట్టు ఫిర్యాదు రాగా అలెర్ట్ అయిన పోలీసులు నకిలీ కేటుగాళ్ల గుట్టు రట్టు చేయడానికి రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications