వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు.. అయినా ప్రేమలో!, చివరికి విషాదమే మిగిలింది..
తమవల్లే ఇదంతా జరుగుతుందని ఆవేదన చెందిన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
మాడుగులపల్లి: వాళ్లిద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు. కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కలిసి జీవించడానికి ఒక్కటవాలనుకున్నారు. వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇద్దరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
నల్గొండ జిల్లా మాడుగులపల్లి కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన చిందాల గిరి(20), చిందాల మౌనిక(20) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వరుసకు వీరద్దరు అన్నా చెల్లెళ్లు కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒకరి కుటుంబంపై మరొకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.

తమవల్లే ఇదంతా జరుగుతుందని ఆవేదన చెందిన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో గిరి ప్రాణాలు కోల్పోయాడు. మౌనిక పరిస్థితి కూడా విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications