రైతుకు బేడీల ఘటనలో కుట్ర దాగుందా?: ఆ అధికారులపై వేటు

సంగారెడ్డి సెంట్రల్ జైలులో రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ 4 గంటలపాటు జైలు సిబ్బందిని విచారించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సి వచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హీర్యానాయక్‌‌ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందుస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

Farmer handcuffed Two prison officers suspended

అయితే, హీర్యానాయక్‌ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని.. బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నారని చెప్పారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? ేక పొరపాటు జరిగిందా? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేశామన్నారు. లగచర్ల కేసులో ఏ2గా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారని తెలిపారు.

హీర్యానాయక్ కు గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడని ఐజీ తెలిపారు. అయితే, సురేష్ ఎవరితో మాట్లాడారనేదానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఇక, హీర్యానాయక్ కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరిండెంట్సంజీవరెడ్డిని, జైలర్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ ఐజీ సౌమ్యమిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

బేడీలతోనే ఆస్పత్రికి తరలింపు

లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతినొప్పి వచ్చింది. దీంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ సందర్భంగా రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయడం గమనార్హం. ఈ విషయం రేవంత్ రెడ్డికి దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు.

అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.

అంతేగాక, హీర్యానాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాగా, రైతు హీర్యానాయక్‌కు ఛాతినొప్పి రావడంతో మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. హార్ట్ బీట్ కొంచెం తక్కువగా ఉందన్నారు.

గతంలో కూడా తనకు గుండె నొప్పి వచ్చిందని హీర్యానాయక్ చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు రిఫర్ చేశామని ఆయన తెలిపారు. దీంతో నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో హీర్యా నాయక్ కు చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+