శరవేగంగా నేలమట్టం.!కనీసం నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటున్న బాదితులు.!
హైదరాబాద్ : నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలను నగర పాలక సంస్థ కూల్చివేత చర్యలు కొనసాగిస్తోంది. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు(5) మున్సిపాలిటీల పరిధిలో పన్నెండు(12) పెద్ద అక్రమ నిర్మాణాలను భూస్థాపితం చేసారు.
నాలుగవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా 45 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హెచ్ఎండిఎ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టిమ్స్ స్పష్టం చేస్తున్నాయి.

మొత్తంగా గత నాలుగు రోజుల్లో నలభై ఐదు అక్రమ నిర్మాణాలను డిస్టిక్ టాస్క్ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి. గురువారం కొంపల్లి, తుర్కయంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ బృందాలు విధులను నిర్వహించాయి.

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు(5)అక్రమ నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలను, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు అక్రమ నిర్మాణాలను, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం పన్నెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మొత్తానికి మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లో జోన్ల వారీగా ఎన్ని అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయో గుర్తించి వాటిని నేలమట్టం చేస్తోంది నగర పాలక సంస్థ.












Click it and Unblock the Notifications