వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరులో కూతుళ్లకి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: పాలమూరులోని గద్వాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సహా తండ్రి మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషయంగా ఉంది.

మృతులు కురుమ్మన్న(35), కురుమ్మక్క(9), ఇందు(5). కుటుంబ కలహాలే ఇందుకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటన పైన గద్వాల్‌ పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.

అత్యాచారం చేసి వీడియో తీశాడు...

ప్రేమికుడే నయవంచకుడై మోసానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన ఆ యువతిని అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను సెల్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. మోసపోయిన ఆ విద్యార్థిని తనకు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా, హనుమాన్‌జంక్షన్‌కు చెందిన విద్యార్థిని పాల్వంచలోని ప్రైవేటు కళాశాలలో బీ ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతోంది.

Father commits suicide in Palamuru

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన హుస్సేన్‌ అనే యువకుడు అక్కడే బీఫార్మసీ చదువుతున్నాడు. సదరు విద్యార్థిని ఆ యువకుడితో ప్రేమలో పడింది. 2013 అక్టోబర్‌లో ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌లో ఒక ఇంటి వద్దకు తీసుకువచ్చి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు.

అది తాగి మత్తులోకి జారుకున్న ఆమెపై హుస్సేన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సెల్‌లో చిత్రీకరించాడు. వాటితో బ్లాక్‌మెయిలింగ్‌ మొదలుపెట్టాడు.

ఆమె నుంచి బంగారం, డబ్బులు వసూలు చేయడంతోపాటు తన మిత్రులైన సునీల్‌, మనోజ్‌, రెహమాన్‌లకు కూడా సహకరించాలని, ఎక్కడకు పిలిస్తే అక్కడకు రావాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒకసారి తాము చెప్పిన పని చేస్తే.వీడియో ఇస్తామని బెదిరించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ విద్యార్థిని ఖమ్మం అర్బన్‌ పోలీసులను ఆశ్రయించింది. అర్బన్‌ సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

English summary
Father commits suicide in Palamuru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X