తెల్లారితే కూతురు పెళ్లి.. తండ్రి మృతి.. పెళ్లింట తీవ్ర విషాదం!
సంతోషంగా పెళ్లి చేసి, కూతుర్ని అత్తగారింటికి పంపించాలని ఆశపడిన ఒక తండ్రి ఆశ తీరకుండానే వెళ్ళిపోయాడు. చిన్ననాడే తల్లి మృతి చెందగా, తండ్రి నీడలో పెరిగిన కుమార్తె తెల్లవారితే పెళ్లి జరుగుతుంది అనగా తండ్రి కూడా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తీరని దుఃఖసాగరంలో మునిగిపోయింది. విన్న ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన ఈ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
కూతురు పెళ్ళికి ముందు తండ్రి మృతితో విషాదం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దు గ్రామంలో ఆండాల అనంతప్ప కుటుంబంలో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే అనంతప్పకు భార్య శాఖమ్మ, ఒక కూతురు, కొడుకు. అయితే పది సంవత్సరాల క్రితం భార్య శాఖమ్మ చనిపోవడంతో లక్ష్మీ అనే మహిళను మళ్ళీ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.

కూతురి పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు
అనంతప్ప మొదటి భార్య శాఖమ్మ కుమార్తె అవంతికి పెళ్లి సంబంధం కుదిరింది. మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరి కే చెందిన భరత్ కు ఇచ్చి పెళ్లి చేయడానికి అనంతప్ప నిర్ణయించాడు. నేడు పెళ్లి జరగాల్సి ఉండగా దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు. ఇంటికి రంగులు వేయించి, ఇంటి ముందు పందిరి వేసి, బంధువులందరినీ పిలిచి అంగ రంగ వైభవంగా పెళ్లి చేయాలని నిర్ణయించాడు.
బైక్ పై నుండి పడి అనంతప్పకు తీవ్ర గాయాలు
ఈ క్రమంలో ఇల్లంతా బంధువులతో సందడిగా మారింది. తెల్లవారితే పెళ్లి అనగా చిన్న చిన్న పనుల నిమిత్తం యాలాల మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అనంతప్ప బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆయనను తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ తండ్రి మృతి, పెళ్లికి బదులు ఆ ఇంట్లో చావు
చికిత్స పొందుతూ అనంతప్ప నేడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. మరి కాసేపట్లో కూతురు పెళ్లి అనగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ విషయం తెలిసిన గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఇక పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే, పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కన్నీరుమున్నీరు కాగా అనంతప్ప అంతిమ సంస్కారాలు చేయనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications