మందుబాబులకు కిక్కే కిక్కు.. హోటల్స్, రెస్టారెంట్ లలో బీర్లు!

తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు పండుగ లాంటి వార్త చెప్పింది ప్రభుత్వం. హోటల్స్, రెస్టారెంట్ లలో అక్కడికక్కడే బీర్లను తయారు చేసి విక్రయించుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అయింది. మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను నిన్నటి నుండి ప్రారంభించింది.

మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్సులు
ఈనెల 25వ తేదీ వరకు మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ మైక్రో బ్రూవరీల నిర్వహణకు అవకాశం ఇవ్వనుంది. హైదరాబాద్ పరిధిలో మొత్తం 18మైక్రో బ్రూవరీస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని నిర్ణయించిన ఆబ్కారీశాఖ తాజా నోటిఫికేషన్ ద్వారా లైసెన్సులు మంజూరు చేయడానికి రెడీ అయింది.

Festive news for liquor addicts beers for you in hotels and restaurants too

Take a Poll

మైక్రో బ్రూవరీస్ యూనిట్ ఏర్పాటు చెయ్యాలంటే ఇలా చెయ్యాలి
ఈ మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేయడానికి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంగణం కావాలి. ఈ యూనిట్లను రెస్టారెంట్లు ఎలైట్ బార్లు, C1 క్లబ్, టీడీ 1, టీడీ 2 లాంటి లైసెన్సు కలిగిన ప్రాంగణాలలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం దరఖాస్తు చేయాలనుకునేవారు లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ప్రాంతాలలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాది గూడ, నిజాంపేట బడంగ్ పేట, బండ్లగూడ జాగిర్, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఇలా చెయ్యాలి
మైక్రో బ్రూవరీస్ యూనిట్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు టి సి యు ఆర్ పరిధిలోని దరఖాస్తుదారులు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఆయా జిల్లాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే tgbcl.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+