గాయానికి కుట్లు కాదు ..ఫెవిక్విక్ చికిత్స; వైద్య సిబ్బంది నిర్వాకం
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. ప్రజల ప్రాణాలను కాపాడడానికి నిత్యం పనిచేసే కర్మ యోగులు, ధన్వంతరి వారసులు వైద్యులు. అయితే అటువంటి వైద్య వృత్తి ఇటీవల కాలంలో నిర్లక్ష్యానికి గురవుతోంది.వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా కొందరి తీరు ఉంది. ప్రజల ప్రాణాలకు ఏమైతే మాకేంటి..మాకు వచ్చినట్టే వైద్యం చేస్తామంటూ కొందరు చిత్రవిచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు.
కడుపులో కాటన్, కత్తులు మర్చిపోయి ఆపరేషన్ చేసే వారు కొందరైతే, ఒకవైపు బాధ ఉంటే మరోవైపు సర్జరీలు చేసేవారు కూడా ఉన్నారు. అంతేకాదు దెబ్బ తగిలింది అని వెళ్తే ఫెవిక్విక్ తో ట్రీట్మెంట్ చేసే ఘనులు కూడా ఉన్నారు.ఇక తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్వాకం అందర్నీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే రాయచూరు జిల్లా లింగ సూగూరు కు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు బంధువుల పెళ్లి నిమిత్తం అయిజ కు వచ్చారు. వంశీకృష్ణ, సునీత దంపతుల కుమారుడు ప్రవీణ్ చౌదరి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటిపైన లోతుగా గాయం అయ్యింది. దీంతో తండ్రి కంటిపైన గాయమైన కొడుకును ఆసుపత్రి కి వెళ్ళాడు.
కంటిపైన లోతుగా గాయం కావడంతో బాలుడి స్థానికంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్య సిబ్బంది లోతుగా తెగిన చోట కుట్లు వేయకుండా , ఫెవిక్విక్ పెట్టి అతికించారు. ఆసుపత్రి సిబ్బంది చేసిన పనిని గుర్తించిన తండ్రి వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడైన నాగార్జునను నిలదీశారు.
దానికి ఆస్పత్రి వైద్యుడు నాగార్జున సిబ్బంది పొరపాటుగా చేసి ఉంటారని, బాలుడికి ఏమీ కాదని, ఒకవేళ ఏదైనా జరిగితే తాను బాధ్యత వహిస్తానని తండ్రికి నచ్చజెప్పారు. ఆసుపత్రి వైద్యులు చెప్పిన సమాధానం నచ్చని బాలుడి తండ్రి నిర్లక్ష్యంగా చెయ్యకూడని పని చేసిన వారిపై , ఆస్పత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications