Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చేవెళ్ళ మర్రిచెట్ల కోసం పోరాటం .. ఏకంగా నేషనల్ హైవేస్ పై ఎన్జీటీలో పిటీషన్; ఇంట్రెస్టింగ్!!

వృక్షో రక్షతి రక్షితః అంటారు.. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని దానర్థం. ప్రకృతిని సంరక్షించాలి అని, ప్రకృతిని సంరక్షిస్తే అది మానవ మనుగడను కాపాడుతుందని అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు గుర్తిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రకృతి పరిరక్షణకు బదులుగా, మానవ అవసరాలకు తగ్గట్టుగా వసతుల కల్పనలో భాగంగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాం. అయితే అలాంటి ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని, పర్యావరణాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడుతున్న పెద్ద పెద్ద చెట్లను నరికి వేయవద్దని ప్రకృతి ప్రేమికులను నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

 చేవెళ్ళ మర్రి చెట్ల కోసం ప్రకృతి ప్రేమికుల పోరాటం

చేవెళ్ళ మర్రి చెట్ల కోసం ప్రకృతి ప్రేమికుల పోరాటం

ఇదే క్రమంలో చేవెళ్ల మర్రిచెట్ల కోసం పర్యావరణ ప్రేమికులు ఏకంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ మెట్లెక్కారు. చేవెళ్ల మర్రి చెట్లను కాపాడాలంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అసలు ఇంతకీ వీరి డిమాండ్ ఏంటి? చేవెళ్ల లో చెట్లకు కలుగుతున్న హాని ఏంటి? అంటే చేవెళ్లలో నేషనల్ హైవే 163లో ప్రతిపాదిత రహదారి విస్తరణ ప్రాజెక్టు చేపట్టింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఈ రహదారిలో 1000 కంటే ఎక్కువ అతి పెద్ద మర్రిచెట్లతో పాటుగా, మొత్తం తొమ్మిది వేల చెట్లు ఉన్నాయి.

రహదారి విస్తరణా పనులు ఆపాలని ఎన్జీటీలో పిటీషన్

రహదారి విస్తరణా పనులు ఆపాలని ఎన్జీటీలో పిటీషన్

ఇవి కొన్ని దశాబ్దాలుగా ఎంతో మందికి నీడని ఇస్తున్నాయి. మన్నెగూడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ చెట్లను నరికి వేసి రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రకృతి ప్రేమికులంతా చేవెళ్లలో దశాబ్దాల కాలంగా ఉన్న చెట్లను పరిరక్షించడం కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చెట్లను రక్షించడం కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) తలుపులు తట్టారు. "సేవ్ బనియాన్స్ ఆఫ్ చేవెళ్ల గ్రూప్" ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు.

పర్యావరణ ప్రభావం అంచనా వేశాకే అనుమతి ఇవ్వాలని ఎన్జీటీకి విజ్ఞప్తి


నేషనల్ హైవేస్ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని లేదా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా (EIA) నిర్వహించిన తర్వాత పర్యావరణ అనుమతులను పొందేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)ని అడగాలని, పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేకుంటేనే అనుమతి ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT)ని ప్రకృతి ప్రేమికుల టీం కోరింది.

సోషల్ మీడియాలోనూ, బయటా మర్రి చెట్ల సంరక్షణ కోసం పెద్ద ఉద్యమం

సోషల్ మీడియాలోనూ, బయటా మర్రి చెట్ల సంరక్షణ కోసం పెద్ద ఉద్యమం


అంతకుముందు సోషల్ మీడియాలో save banyans of chevella పేజ్ క్రియేట్ చేసి స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం సోషల్ మీడియా ద్వారా, చేవెళ్ల మర్రి చెట్లను కాపాడాలన్న సందేశాన్ని పంపడం మొదలుపెట్టారు. అంతేకాదు మర్రి చెట్ల వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న చెట్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. పెయింటింగ్స్ వేశారు .పోస్టర్లు ప్రదర్శించారు .చెట్లకు దారాలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. రెండు వేల మందికి పైగా ప్రకృతి ప్రేమికులు చెట్లను పరిరక్షించడం కోసం పిటిషన్ ద్వారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

 ఎన్జీటీ విచారణ.. నరకటం లేదు చెట్లను లెక్కిస్తున్నాం అన్న నేషనల్ హైవేస్

ఎన్జీటీ విచారణ.. నరకటం లేదు చెట్లను లెక్కిస్తున్నాం అన్న నేషనల్ హైవేస్

పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి ప్రేమికులు వేసిన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి చెట్లను నరికి వేసే ఆలోచన లేదని, వారు చెట్లను లెక్కించడం మాత్రమే చేస్తున్నారని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కోర్టుకు తెలియజేసింది. అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ముడిమ్యాల్ మరియు కండ్లపల్లిలోని చివరిగా మిగిలి ఉన్న స్క్రబ్ ఫారెస్ట్‌లను కూడా ప్రమాదంలో పడేస్తుందని, ఈ ప్రాంతం వలస వచ్చే హారియర్స్ మరియు అరుదైన టానీ ఈగల్స్ కు ఆవాసంగా ఉందని అందువల్ల దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+