ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ఆర్దిక శాఖ కీలక ఉత్తర్వులు.. వారికి కోత..!!
ఉద్యోగుల జీతాల పై ఆర్దిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల జీతాల చెల్లింపు పైనా తాజాగా అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ తో పాటుగా ఇప్పటికే కోరిన విధంగా వివరాలు ఇవ్వని ఉద్యోగుల జీతాలు చెల్లించవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అటువంటి వారికి అక్టోబర్ జీతాలు నిలుపుదల చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత గడువు ముగియటంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం తీసుకుంది. IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే అక్టోబరు జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబరు 25వ తేదీ అర్ధరాత్రి లోపు ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు అందరూ పాటించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని వారి అక్టోబరు జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ సర్క్యులర్‌పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయలేదు. 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకుగాను 2.22 లక్షల మంది వివరాలే నమోదయ్యాయి. ఇక తాత్కాలిక ఉద్యోగుల్లో 4.93 లక్షల మందికిగాను 2.74 లక్షల మంది వివరాలే నమోదు చేశారు. ఏ ఒక శాఖ కూడా వందశాతం ప్రక్రియను పూర్తి చేయలేదు.
ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు, సంస్థ లు, పీఎస్‌యూలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, దినసరి వేతనాలకు పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పూర్తి వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదుచేయాలని మరోసారి ఆదేశించారు. పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం వల్ల వేతనాల చెల్లింపులో పారదర్శకత ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications