TG Budget: శుభవార్త చెప్పిన భట్టి.. త్వరలో సాకారం కానున్న సొంతింటి కల..!
గూడు లేని పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిఖ శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భట్టి విక్రమార్క తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూలని ప్రజలను వచ్చిందనన్నారు. తమ పార్టీ ఆరు గ్యారింటీల్లో భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా ఉందన్నారు.
స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. జాగ లేని వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని పేర్కొన్నారు. ఇందుకు కోసం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో చాలా మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని.. వారి కలను నెరవేరుస్తామని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త నిర్మించబోయే పబ్లిక్ స్కూళ్లకు రూ. 500 కోట్లు కేటాయించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొన్ని నియోజకవర్గాల్లోనే డబులు బెడ్ నిర్మించింది.ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు. కొంత మందికి డబుల్ బెడ్ రూంల పంపిణీ కూడా జరిగింది. అయితే అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అలాగే తెలంగాణ వారికి కాకుండా ఆంధ్రవారికి కూడా డబుల్ బెడ్ రూంలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ బడ్జెట్ లో యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం రూ. 500 కోట్లు , గృహ నిర్మాణానికి రూ. 7540 కోట్లు కేటాయించనున్నట్లు భట్టి వివరించారు.
బీసీ సంక్షేమం కోసం రూ.8000 వేల కోట్లు.. గురుకులాల సొంత భవనాల కోసం రూ. 1546 కేటాయిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.












Click it and Unblock the Notifications