• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆర్థిక నేరగాడిని వదలం: కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, హెచ్చరికలు

|
  Telangana Elections 2018 : కారు దిగి చేయి అందుకుంటారనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజం అయ్యాయా ?

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణకు నీళ్లు ఆపుతారని తెరాస నేతలు చెబుతున్నారని, కానీ ఏపీ కంటే తెలంగాణ పైన ఉందని, కాబట్టి చంద్రబాబు ఆపాలని భావించినా ఆపలేరని చెప్పారు.

  చదవండి: చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్‌కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత

  తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేతకాకే రీడిజైనింగ్‌ పేరిట పూర్తి చేస్తానని దోచుకుంటుంటే ప్రశ్నించినందుకు, అనుమతుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడిగినందుకే చంద్రబాబుపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  కేటీఆర్ ఆర్థిక నేరగాడు, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలి

  కేటీఆర్ ఆర్థిక నేరగాడు, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలి

  కేటీఆర్ ఓ‌ ఆర్థిక నేరగాడని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక దందాలు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను వదిలేది లేదని చెప్పారు. కేటీఆర్‌ ఆర్థిక నేరాలను వెలుగులోకి తెస్తామన్నారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోతే అమెరికాకు వెళ్తానని కేటీఆర్, ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పాస్‌పోర్ట్ సీజ్ చేయాలన్నారు.

  పాలమూరులో పోటీకి సిద్ధమా?

  పాలమూరులో పోటీకి సిద్ధమా?

  అధికారం లేకుంటే ప్రజలకు సేవ చేయరా అని ప్రశ్నించారు రేవంత్.
  అసెంబ్లీ ఎన్నికల్లో తనతో సవాల్ చేసేందుకు కేటీఆర్ ఓనర్ కాదని, పని వాడని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు దమ్ముంటే లోకసభ ఎన్నికల్లో తనతో పోటీకి సిద్ధపడాలని సవాల్ విసిరారు. గతంలో కేసీఆర్‌ పోటీ చేసిన మహబూబ్‌నగర్‌ ఎంపీకి పోటీ చేద్దామని, చేతనైతే కేటీఆర్ తన సవాల్ స్వీకరించాలన్నారు. కేటీఆర్ ఆర్థిక నేరగాడని, అందుకే పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి పాస్‌పోర్ట్ సీజ్ చేసి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలన్నారు.

  టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటి?

  టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటి?

  తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నీళ్లు తెలంగాణ వదిలితేనే ఆంధ్రాకు వెళ్తాయన్నారు. కొడంగల్‌ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని కేటీఆర్‌ మాయమాటలు చెబుతున్నారన్నారు.

  పక్క రాష్ట్ర సీఎంను రానివ్వరు కానీ, ప్రంట్ ఏర్పాటా?

  పక్క రాష్ట్ర సీఎంను రానివ్వరు కానీ, ప్రంట్ ఏర్పాటా?

  చంద్రబాబును తెరాస నేతలు విమర్శించడాన్ని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా తప్పుబట్టారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును తెలంగాణలో అడుగు పెట్టబోనివ్వనని చెబుతున్న కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబును విమర్శించడమేమిటన్నారు. ఈ ఎన్నికల్లో ఏమీ చెప్పడానికి లేకే కేసీఆర్‌ చంద్రబాబును టార్గెట్‌ చేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మిగతా రాజకీయ పార్టీలను కేసీఆర్‌ ఎలా ఏకం చేస్తారన్నారు. జగన్‌‌, పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పోటీ చేయాలంటే వాళ్లకు బీజేపీ అనుమతి కావాలన్నారు.

  English summary
  Congress Party working president Revanth Reddy on Thursday said that Minister KTR is financial criminal.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X