బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం; ఒకరు మృతి; పలువురికి తీవ్రగాయాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న విషయం తెలిసింది. అయితే తాజాగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో బాణాసంచా పేల్చడంతో, పేలిన బాణాసంచా నిప్పురవ్వలు ఒక గుడిసె పై పడి, గుడిసె దగ్ధమైంది. దీంతో భారీ పేలుడు సంభవించింది.ఖమ్మం జిల్లా ఏజెన్సీ చీమలపాడు ప్రాంతంలోని కారేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తంగా మారింది.
కారేపల్లి మండలం చీమలపాడులో టిఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహించగా భారీగా జన సమీకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యనేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి జాగ్రత్త లేకుండా బాణాసంచా కాల్చారు. బాణాసంచా నిప్పురవ్వలు పడి పక్కనే వంటలు చేస్తున్న పూరి గుడిసె దగ్ధం కావడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.

బాణాసంచా పేలుడు తో గుడిసె దగ్ధం కాగా, గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి విధులు నిర్వహిస్తున్న సిఐతో సహా పదిమంది కాళ్లు చేతులు తెగిపడ్డాయి. గాయపడిన వారిలో పోలీసులు, జర్నలిస్టులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అయితే గుడిసెకు అంటుకున్న మంటలతో, గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒకసారిగా పేలినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది. క్షతగాత్రుల ఆక్రందనలతో అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది.
అగ్నిప్రమాద ఘటనలో మహారాష్ట్రకు చెందిన వలసకూలీ సందీప్ మృతి చెందినట్టుగా గుర్తించారు. అగ్నిప్రమాద ఘటనలో 10 మందికి గాయాలు కాగా, వారిలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురి కాళ్ళు, చేతులు అగ్నిప్రమాద దాటికి నుజ్జు నుజ్జు కావడంతో గ్రామంలో బీతావహ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు అక్కడికి వచ్చారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిలిపివేసిన నేతలు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్థానికులు పోలీసుల సహకారంతో మంటలను ఆర్పుతున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications