కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మెదక్ జిల్లావాసుల మృతి
హైదరాబాద్: పొట్ట పోసుకోవడానికి పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వెళ్లిన ఐదుగురు మెదక్ జిల్లా వాసులు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లా మనూరు మండలం ఇరాక్ పల్లి డోవూరు తండాకు చెందిన పలువురు గిరిజనులు కర్ణాటక రాష్ట్రంలోని ఓ కర్మాగారంలో పనిచేసేందుకు వెళ్తుండగా వారిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
మెదక్ జిల్లా వాసులు ప్రయాణిస్తున్న లారీ ఓ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. జైసింగ్(40), ఫాతీబాయి(35), కృష్ణ(10) అనే వారు మృతిచెందగా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో తమ ఊరికి చెందినవార మృతిచెందడంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

చెరువులో రెండు మృతదేహాలు
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలంలోగల బేతుపల్లి పెద్ద చెరువులో మంగళవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సత్తుపల్లి జవహర్‌నగర్‌కు చెందిన ముళ్లపూడి నవీన్(28), ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన మిట్టపల్లి లక్ష్మీకుమారి(27) ల మృతదేహాలు మంగళవారం ఉదయం చెరువులో తేలాయి.
దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వీరు చెరువులో పడి మృతిచెందడంపై విభిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications