వరంగల్ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి, ఆదేశం!
ఖమ్మం - వరంగల్ మామునూరు హైవేపై నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడేళ్ల బాలుడు.ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఇందులో. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రోడ్డు ప్రమాద ఘటనపై అధికారులకు సీఎం ఆదేశం
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారదను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా ఖమ్మం - వరంగల్ మామునూరు హైవే రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనా స్థలాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో మృతుల దేహాలు పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామాలకు
ఖమ్మం నుంచి ఐరన్ లోడ్ తో వరంగల్ వైపు వస్తున్న భారీ వాహనం అదుపుతప్పి అటువైపు వెళుతున్న రెండు ఆటో లపై పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒక్కరూ ఎంజీఎం లో ఒక్కరూ చనిపోయారు. గాయపడ్డ ఇద్దరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్ట్ మార్టం అనంతరం స్వస్థలాలకు తరలించాలని సూచించారు.
డ్రైవర్ తాగి వాహనం నడపటం వల్లే ప్రమాదం
108 వాహనాల ద్వారా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించాలని ఎంజిఎంకు పంపిస్తూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులని ఆదేశించారు. ట్రక్ డ్రైవర్ మద్యం త్రాగి డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని, అతన్ని మామునూరు పోలీసుల కస్టడీలో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎంజీయంలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు.
ప్రమాద ఘటనా స్థలంలో అన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
ఘటనా స్థలంలో సిపి అంబర్ కిషోర్జ ,డీసీపీ రవీందర్ , మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తాసిల్దార్ లో నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి. ఈఈ జితేందర్ రెడ్డి , ఎం.హెచ్.ఓ సాంబశివరావు తదితరులు ఉన్నారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. క్రేన్ల సాయంతో లారీని, ఇనుప రాడ్ లను రోడ్డు మీద నుండి తొలగించారు.












Click it and Unblock the Notifications