తెలంగాణలోని హన్మకొండతో సహా ఆ నగరాలకు కేంద్రం శుభవార్త!
తెలంగాణాలో మంచి ఆరోగ్యకరమైన రాష్ట్రంగా మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించటం కోసం "హెల్తీ అండ్ హైజినిక్ ఫుడ్ స్ట్రీట్స్" ఏర్పాటు చేయటానికి కేంద్రం సంకల్పించింది. బయట తినాలి అంటే పరిశుభ్రత, వాడే పదార్థాల నాణ్యతపై ప్రతీ ఒక్కరికీ అనుమానం ఉంటున్న సమయంలో కేంద్రం దేశ వ్యాప్తంగా ఫుడ్ స్ట్రీట్ లను ఏర్పాటు చెయ్యాలని, మంచి హైజీనిక్, హెల్డీ ఫుడ్స్ అందించాలని నిర్ణయించింది.
కేంద్రం ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా 100ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 86కేంద్రాలకు అనుమతులు లభించాయి. ఈ స్ట్రీట్ ఫుడ్స్ తెలంగాణా రాష్ట్రంలోనూ మూడు చోట్ల ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధమయ్యింది.ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఒక్కో ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటుకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 1కోటి నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించటం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

తెలంగాణాలో ఈ నగరాలలో ఫుడ్ స్ట్రీట్స్
ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని హన్మకొండ, నిజామాబాద్,మహబూబ్ నగర్ నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రాంగణం మొత్తం టైల్స్‌తో నిర్మించి,దుమ్ము, ధూళి లేకుండా ఏర్పాట్లు చేస్తారు. రాత్రివేళల్లో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేలా వాతావరణం కల్పిస్తారు.
స్టాల్స్ నిర్వహించాలి అంటే ఇలా చెయ్యాల్సిందే
స్టాల్స్ కేటాయింపులో కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇక ఈ స్ట్రీట్ ఫుడ్స్ FSSAI సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. విక్రేతలకు పరిశుభ్రతపైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటం పైన ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. వంట చేసేవారు గ్లోవ్స్, ఆప్రాన్ ధరించడం తప్పనిసరి. ఈ ఫుడ్ స్ట్రీట్ లో ఫుడ్ విక్రేతలు గోర్లు పెంచుకోవడం, ఉంగరాలు ధరించడం, పొగాకు లేదా సిగరెట్లు వాడటం పూర్తిగా నిషేధం.
అధికారుల నిరంతర పర్యవేక్షణ
ఇక వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ముడిసరుకులు మరియు తయారైన ఆహార నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. వినియోగదారుల కోసం వాటర్ ప్లాంట్ల ద్వారా శుద్ధజలం, చేతులు కడుక్కోవడానికి ప్రత్యేక వాష్ ఏరియాలు ఏర్పాటు చేస్తారు. అలాగే సౌకర్యవంతమైన బెంచీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి సురక్షితంగా భోజనం చేసే అవకాశం కల్పిస్తారు.
ఆరోగ్యంగా, పరిశుభ్రంగా మీ స్ట్రీట్ ఫుడ్
ఈ ప్రాజెక్ట్ ద్వారా స్ట్రీట్ ఫుడ్‌కు కొత్త గుర్తింపు లభించడంతో పాటు, ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో కూడా ఇది కీలకం కానుంది. రుచితో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణ నగరాల్లో ఏర్పాటు చేసే ఫుడ్ స్ట్రీట్ ఇకపై ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆహారాన్ని అందిస్తుంది. మీ స్ట్రీట్ ఫుడ్ కోరికలను తీరుస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications